Vikarabad Sireesha Case: వికారాబాద్ జిల్లా కాలాపూర్‌లో శిరీష హత్యకేసులో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. శిరీష అనే యువతిని ఆమె బావ అనిల్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీష హత్యకేసులో అనిల్‌కు సహకరించిన రాజు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి శిరీష నీటి కుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 11న శిరీష నీటి కుంటలో శవమై కనిపించింది. ఈ కేసుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పరిగి పోలీసులు.. తాజాగా శిరీష బావ అనిల్‌ను అదుపులోకి తీసుకొని, విచారించారు. శనివారం రాత్రి ఫోన్ విషయంలో అనిల్, శిరీష మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలోనే అనిల్ కోపంతో శిరీషను కొట్టడంతో.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన శిరీష.. ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో శవమై తేలింది.
Read also: Congress: సీడబ్ల్యూసీ పై ఖర్గే నజర్.. తెలంగాణ నుంచి ఒకరికి ఛాన్స్..?
దీంతో.. శిరీషని అనిల్ హత్య చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో శిరీష తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీకాంత్‌లను కూడా ప్రశ్నించారు. అయితే శిరీష మృతికి ఆమె బావమరిది అనిల్ కారణమని పోలీసులు నిర్ధారించారు. శిరీష రోజూ మొబైల్ ఫోన్ చూస్తుండటంతో బావ అనిల్ అమెను కొట్టారు. దీంతో శిరీష ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు, బావ అనిల్ ఆమెను రక్షించారు. అయితే మనస్తాపానికి గురైన శిరీష అదే రోజు రాత్రి శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శిరీష బావ అనిల్ మద్యం మత్తులో ఇంటివైపు వస్తు శిరీషను గమనించాడు. శిరీష వద్దకు వెళ్లి ఆమెను కొట్టాడు. తన వద్ద వున్న బీరు సీసాతో శిరీషపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో శిరీష మృతి చెందిందని గమనించిన బావ అనిల్ శిరీష మృత దేహాన్ని అక్కడే వున్న నీటి కుంటలో పడేసి వెళ్లిపోయాడు. జూన్ 11న శిరీష మృతదేహం నీటికుంటలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై బావ అనిల్‌పై పోలీసులు అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. శిరీషను బావ అనిలే హత్య చేశాడని నిర్ధారించారు. అనిల్‌కు సహకరించిన రాజు అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. కాగా శిరీష బంధువులు అనిల్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తన మరదలిపై కన్నేసి అమానుషంగా చంపేశాడని వాపోయారు. ఇలాంటి వారికి బతికే అర్హత లేదంటూ కన్నీరుపెట్టుకున్నారు.
Congress: సీడబ్ల్యూసీ పై ఖర్గే నజర్.. తెలంగాణ నుంచి ఒకరికి ఛాన్స్..?