తమిళనాడులో రాజ్ భవన్‌లో అర్ధరాత్రి వరకు పొలిటికల్ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్‌ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది.
MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్ర
మనీలాండరింగ్ ఆరోపణలతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. న్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని చేర్చారు.
IT Raids : చెన్నైలో ఐటీ దాడుల కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు.