నారి సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుండగా నారి టీమ్ 7 & 8 తేదీల్లో 1+1 ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 7 & 8 తేదీల్లో నారి సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. 7వ తేదీన , 8వ తేదీన అన్ని షోస్ కు ఈ ఆఫర్ వర్తించనుంది. అందరూ తమ టికెట్స్ సమీపంలోని థియేటర్లలో, బుక్ మై షో ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని చెబుతూ దర్శకుడు సూర్య వంటి పల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. “నారి” సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, రాజమండ్రి శ్రీదేవి,ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, శ్రీలత, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక “నారి” సినిమా నుంచి రిలీజ్ చేస్తున్న కంటెంట్, పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. ప్రముఖ సింగర్ సునీత పాడిన ‘హవాయి హవాయి హవాయి’ సాంగ్ కు గీత రచయిత భాస్కరభట్ల బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారు. ఇటీవల రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాట యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే సింగర్ సునీత పాడిన హవాయి హవాయి హవాయి పాట కూడా ఆకట్టుకుంటోంది .