తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సాధారణ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది.18 డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తును డిసెంబర్ 16 నుండి జనవరి 5, 2023 వరకు సమర్పించవచ్చు. అర్హత గల అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడే ప్రొఫార్మా అప్లికేషన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత వివరణాత్మక నోటిఫికేషన్ మరియు సమాచారం కోసం అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని TSPSC ఆదేశించింది.
Also Read :Sonal Chauhan : అంగాంగ ప్రదర్శనతో సెగల రేపుతున్న సోనల్ చౌహాన్
ఇదిలా ఉంటే.. ఇటీవల వైద్యారోగ్య శాఖ (MHSRB)లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 20, 2022 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనవరి 05, 2023 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుంది. మొత్తం 34 విభాగాల్లో ఈ 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ చూడొచ్చు.