బెజవాడను వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న ఉదయం గాంధీనగర్ జింఖానా గ్రౌండ్ లో, రాత్రి గవర్నర్ పేటలో అర్దరాత్రి ఫకీర్ గూడెంలో భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. అయితే.. ఝింఖానా గ్రౌండ్సలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదాహనం కావడం అందరినీ కలచివేసింది. ఇదిలా ఉంటే.. నిన్న అర్థరాత్రి ఫకీర్ గూడెంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా నిప్పురవ్వలు పడడంతో 15 ఇళ్లు దగ్దమయ్యాయి. మొదట ఒక ఇంటికి నిప్పు అంటుకోవడంతో అలెర్ట్ అయ్యారు స్థానికులు.
అయితే.. స్దానికులు మంటను అదుపు చేసేలోపే వేగంగా మిగిలిన ఇళ్లకు మంటల వ్యాపించాయి. దీంతో.. వరుసగా ఉన్న 15 ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి. అయితే.. అగ్ని మాపక సిబ్బంది, స్థానికులు చొరవతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తినష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీపావళి పండుగ వేళ ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.