Today Stock Market: ట్రేడింగ్ వారంలో రెండో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలలో ముగిసింది. నేటి ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మాత్రం నష్టాలలో ముగిసాయి. నేడు సెన్సెక్స్ 106.72 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద ముగిసాయి. ఇక నిఫ్టీలో నేటి ట్రేడింగ్‌లో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలవగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో షేర్లు టాప్ లూజర్‌గా నిలిచాయి.
Also Read: Central Bank Of India Recruitment: ఐటీ స్పెషలిస్ట్‌లకు శుభవార్త.. బ్యాంకులో ఉద్యోగాలు
ఈ మధ్య కాలంలో భారీగా పడిన మార్కెట్లు షార్ట్ కవరింగ్ అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ ఎక్కువ రావడంతో మార్కెట్లు పరుగు పెట్టినట్లు చెబుతున్నారు. కాకపోతే ప్రపంచస్థాయిలో భౌగోళిక ఆందోళనలు, రాజకీయ సంక్షోభంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ప్రపంచ ప్రధాన కరెన్సీల మారకంలో డాలరు ఇండెక్స్ భారీగా బలపడుతుండటంతో రూపాయి విలువ క్షిణిస్తోంది.
Also Read: Cricket Umpire: క్రికెట్ అంపైర్ ఎలా అవ్వాలి.? జీతం ఎంతొస్తుందంటే..