Shraddha Walker Case: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు అఫ్తాబ్ పోలీస్ కస్టడీని కోర్టు గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. నార్కో టెస్టుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో శ్రద్ధ శరీర భాగాలు ఇంకా అన్నీ దొరకలేదు. ఆమెను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీనికి ఇంకా చాలా రోజులు పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రెండేళ్ల నుంచి శ్రద్ధావాకర్ వాట్సప్ సంభాషణలు, ఇన్‌స్టా చాట్‌లో ఆమె తన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలాచే ఎంతగా హింసించబడిందో తెలుస్తోంది.

అఫ్తాబ్‌పై సాక్ష్యాధారాల విషయమై విచారణ కొనసాగుతుండగా అతని క్రూరత్వానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చి షాక్ ఇస్తున్నాయి. శ్రద్ధా వాకర్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు తెరపైకి వచ్చాయి. 2020లో శ్రద్ధని కొట్టడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా శ్రద్ధా, అఫ్తాబ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2020లో తన స్నేహితురాలితో శ్రద్ధ చాట్ చేసింది. “నేను ఈ రోజు పని చేయలేకపోతున్నాను. ఎందుకంటే నిన్న అతను తీవ్రంగా కొట్టడం వల్ల నా బీపీ తక్కువగా ఉంది. నా శరీరం నొప్పిగా ఉంది. మంచం దిగేంత శక్తి కూడా నాకు లేదు” అని ఆమె వాట్సాప్ చాట్‌లో రాసి ఫోటోను జత చేసింది. గాయం గుర్తులతో ఆమె ముఖం. సంభాషణల స్క్రీన్‌షాట్‌లు ఇప్పుడు ఢిల్లీ పోలీసుల వద్ద ఉన్నాయి. అదే సమయంలో ఆమె ఆసుపత్రిలో కూడా చేసింది.

పోలీసుల విచారణలో ఇంతకుముందు కూడా అఫ్తాబ్ శ్రద్ధను చంపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. 23 నవంబర్ 2020న ముంబైలోని నలసుపరా పోలీస్ స్టేషన్‌లో శ్రద్ధ ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ గొడవ గురించి శ్రద్ధా తన స్నేహితులకు కూడా చెప్పింది. పోలీసులు అఫ్తాబ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్పుడు శ్రద్దా తన ఫిర్యాదును తిరిగి తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా ఈ కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అఫ్తాబ్ ఆమెను ఎలా దారుణంగా కొట్టేవాడో శ్రద్ధా స్నేహితురాలు ఓ చిత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే శ్రద్దా వీటన్నింటిని ఎదుర్కొని కూడా బతికే ఉండాలని కోరుకుంది.. అఫ్తాబ్‌తో సంతోషంగా జీవించాలని కోరుకుంది. అందుకే తనకు ఎన్ని దెబ్బలు తాకినా ఆ చిత్రంలో కూడా ఆమె నవ్వుతోంది. మెడ నుంచి చెంప వరకు గాయం గుర్తులు కనిపిస్తాయి.
శ్రద్ధ 2020 డిసెంబర్ 3న ముంబైలోని ఆసుపత్రిలో చేరింది 3 డిసెంబర్ 2020 న, శ్రద్ధ ముంబైలోని ఆసుపత్రిలో చేరింది. వెన్నులో విపరీతమైన నొప్పి రావడంతో శ్రద్ధా ఆస్పత్రిలో చేరింది. దాదాపు వారం రోజుల పాటు తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ శ్రద్ధ డిసెంబర్ 3, 2020న ఓజోన్ హాస్పిటల్ వాసాయిలో చేరింది. శ్రద్ధను అఫ్తాబ్ కొట్టేవాడని.. అంతేకాదు అతను గంజాయి కూడా తీసుకునేవాడని స్నేహితులు చెప్పారు. ఢిల్లీకి చేరుకోవడానికి కొన్ని రోజుల ముందు అంటే మే 4న, శ్రద్ధా అఫ్తాబ్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని శివపురి సమీపంలోని వశిష్ట గుహకు వెళ్లింది.ఈ గుహ గంగా నది ఒడ్డున ఉంది, శ్రద్ధా అక్కడ నుండి చివరి రీలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
1500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. రోజు చివరిలో సూర్యాస్తమయాన్ని చూడటానికి ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు శ్రద్ధా ఈ రీల్‌లో రాసింది. అనంతరం మే 11 న, శ్రద్ధా తాము ఒక కేఫ్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిం. ఆ ఫొటోలో తాను మరింత ఎక్కువగా అన్వేషించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ కేఫ్ హిమాచల్‌లో ఉంది. పోలీసులు తమ విచారణ లో భాగంగా ఈ ప్రదేశాలను సందర్శించి మరింత దర్యాప్తు చేయవచ్చు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. శ్రద్ధ అఫ్తాబ్‌తో కలిసి ఢిల్లీకి మారాలని భావించింది. అయితే అఫ్తాబ్ ఢిల్లీకి షిప్ట్ అవ్వడానికి వ్యతిరేకించాడు. అంతేకాదు.. అఫ్తాబ్ ఎక్కువగా తన ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. దీంతో శ్రద్ధ ఎవరితో చాట్ చేస్తున్నావని అడిగితే అఫ్తాబ్ తప్పించుకునే సమాధానాలు ఇచ్చేవాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు తరచుగా జరిగేవి. చిన్న చిన్న మనస్పర్థల వల్ల ఏర్పడిన ఇద్దరి మధ్య దూరం తొలగిపోతుందని అఫ్తాబ్ శ్రద్ధతో హిమాచల్, ఉత్తరాఖండ్ కూడా వెళ్లాడని తెలిసింది.
శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణలో రోజురోజుకు షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తాను మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి. గొడవ అనంతరం గంజాయి మత్తులోనే శ్రద్ధను తాను చంపానని, కావాలని హత్య చేయలేదని అఫ్తాబ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మే 18 రాత్రి 9నుంచి 10 గంటల సమయంలో శ్రద్ధను హత్య చేసిన తర్వాత రాత్రంగా గంజాయి సిగరెట్ తాగుతూ మృతదేహం పక్కనే ఉన్నట్లు అఫ్తాబ్ వివరించాడు. హత్య అనంతరం శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ వాటిని 300 లీటర్ల ఫ్రిజ్‍లో దాచాడు. తర్వాత శరీర భాగాలను సమీపంలోని అడవితో పాటు మరికొన్ని ప్రదేశాల్లో పడేశాడు. ఢిల్లీలోని ఇతర జిల్లాల్లో తమ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా ఏదైనా శరీర భాగాలు కనిపిస్తే వాటి సమాచారాన్ని పంచుకోవాలని కోరారు ఢిల్లీ పోలీసులు కోరారు.