తన జీవిత భాగస్వామిని హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో రోజుకొక విషయం వెలుగుచూస్తోంది. శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణను పోలీసులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు.
శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా గత నెల తెల్లవారుజామున తన ఇంటి వెలుపల నుంచి బ్యాగ్‌తో నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను మోసుకెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Shraddha Walker Case: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు అఫ్తాబ్ పోలీస్ కస్టడీని కోర్టు గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. నార్కో టెస్టుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో శ్రద్ధ శరీర భాగాలు ఇంకా అన్నీ దొరకలేదు. ఆమెను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీనికి ఇంకా చాలా రోజులు పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రెండేళ్ల నుంచి…