శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిపై ఆరోపణలను ధ్రువపరిచే ఆధారాలను ఢిల్లీ పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ వాదనలో పోలీసులు కీలక విషయాలను తెలిపారు.
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ అమీన్ పూనావాలా బెయిల్ కోరుతూ శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అతని న్యాయవాది వెల్లడించారు.
తన జీవిత భాగస్వామిని హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు
సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ పూనావాలాకు ఈ రోజు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్సెస్ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.