సీఎం ఎవరనేదానిపై నేడు క్లారిటీ:
సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, నిన్న సమావేశమైన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఖరారు అయ్యే వరకు వారంతా అక్కడే ఉండనున్నారు.
భారీగా విమానాలు రద్దు:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మిచాంగ్’ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో.. తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. గన్నవరం నుంచి నడిచే 15 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, షిర్డీ, కడప, ఢిల్లీ విమానాలు రద్దు అయ్యాయి. విశాఖ నుంచి వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. నేడు, రేపు పూర్తిస్థాయిలో ఎయిర్ పోర్టు ఆపరేషన్ జరగనుంది.
తెలంగాణపై మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్:
ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి నెల్లూరు నుంచి ఓడరేవు వైపు కదులుతున్న మైచాంగ్ తుపాను మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. ఇది బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ అంతటా వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట్, బాలానగర్, కూకట్‌పల్లి, కొండాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, చంద్రగిరి, కోఠి, చంద్రగిరి, కోఠి. వర్షం పడుతున్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్:
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ గ్రామ సచివాలయాల్లో పశు సంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం-రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 1,896 ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నారు.
రోడ్డు దాటుతున్న మొసలి:
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తుపానుగా మారింది. తుఫానుకు మిచాంగ్ అని పేరు పెట్టారు. ఇది చెన్నైకి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయువ్య దిశలో పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో తుపాను ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను చెన్నైకి 140 కి.మీ దూరం నుంచి కదులుతుండగా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో వాయుగుండాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. అయితే ఓ మొసలి రోడ్డు దాటుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చెన్నై పెరుంగళత్తూరు-నెల్కుకుంరం రహదారిపై ఓ భారీ మొసలి రోడ్డు దాటుతోంది.
వేణు దర్శకత్వంలో నాని:
న్యాచురల్ స్టార్ నాని వరుసగా హిట్స్ కొడుతున్నాడు. ఇటీవల నాని నటించిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం ‘హాయ్ నాన్న’ని తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు. ఇందులో భాగంగా ఒక అభిమాని.. ‘కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. దానికి నాని బదులిస్తూ.. ‘బలగం వేణు’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది