*చంద్రయాన్-3కు నాయకురాలిగా లక్నోకు చెందిన ‘రాకెట్ ఉమెన్’
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మూడో చంద్ర మిషన్ అంటే ‘చంద్రయాన్-3’ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రుడి వైపు వెళ్లేందుకు వేచి ఉంది. చంద్రయాన్-3 మిషన్ ‘మూన్ మిషన్’ అనేది 2019 సంవత్సరం ‘చంద్రయాన్-2’ తదుపరి మిషన్. భారతదేశం ఈ మూడవ చంద్ర మిషన్‌లో కూడా అంతరిక్ష శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘చంద్రయాన్-2’ మిషన్ సమయంలో చివరి క్షణాల్లో ల్యాండర్ ‘విక్రమ్’ మార్గం విచలనం కారణంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయలేకపోయింది. ఈసారి చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైతే అటువంటి ఘనత సాధించిన అమెరికా, చైనా, మాజీ సోవియట్ యూనియన్ వంటి దేశాల క్లబ్‌లో భారతదేశం చేరుతుంది. చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను మహిళా శాస్త్రవేత్త రీతూ కరిధాల్‌కు అప్పగించారు. చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్‌గా ‘రాకెట్ ఉమెన్’గా ప్రసిద్ధి చెందిన రీతూ కరిధాల్ తన పాత్రను పోషిస్తోంది. యుపిలోని లక్నోకు చెందిన స్థానిక నివాలీ రీతు సైన్స్ వరల్డ్‌లో భారతీయ మహిళల పెరుగుతున్న బలానికి ఉదాహరణ. మంగళయాన్ మిషన్‌లో తన సత్తా చాటిన రీతు ఈరోజు తన ప్రొఫైల్‌లో చంద్రయాన్-3తో మరో విజయవంతమైన విమానాన్ని నమోదు చేయనున్నారు. రీతూ కరిధాల్ లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. అంతరిక్ష శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగా తదుపరి చదువుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరాడు. కోర్సు పూర్తయిన తర్వాత ఇస్రోలో ఉద్యోగం ప్రారంభించారు. ఏరోస్పేస్‌లో నైపుణ్యం సాధించిన రీతూ కెరీర్‌లో అద్భుతమైన విజయాలు సాధించింది. అతను 2007లో యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నాడు. విభిన్న మిషన్లలో ఆమె పాత్ర కోసం దేశంలోని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలలో తన పేరు చేర్చబడింది. విశేషమేమిటంటే, రీతూ మంగళయాన్ మిషన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. యూపీ రాజధాని లక్నో కుమార్తె రీతూ చంద్రయాన్-మిషన్ 2లో మిషన్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టడంతో వెలుగులోకి వచ్చింది. భారతదేశం ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమం ‘చంద్రయాన్-3’కి ముందు ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ గురువారం మాట్లాడుతూ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ విజయవంతం చేసిన ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారతదేశాన్ని మారుస్తామని పేర్కొన్నారు.
*చంద్రయాన్- 3 ప్రయోగం.. ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు
భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. ఈ చంద్ర మిషన్ 2019 సంవత్సరం చంద్రయాన్ 2 తదుపరి మిషన్. భారతదేశం ఈ మూడవ మిషన్‌లో, శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘చంద్రయాన్-2’ మిషన్ సమయంలో చివరి క్షణాల్లో ల్యాండర్ ‘విక్రమ్’ మార్గం విచలనం కారణంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయలేకపోయింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్ట్ ఎల్వీఎం3ఎం4 రాకెట్‌తో శుక్రవారం అంతరిక్షంలోకి వెళ్లనుంది. చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్ధంగా ఉంజి. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు రాకెట్ దూసుకెళ్లనుంది. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. శ్రీహరి కోట నుండి చంద్రయాన్- 3 ప్రయోగంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చందమామపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ మిషన్ విజయవంతమైతే అటువంటి ఘనత సాధించిన అమెరికా, చైనా, మాజీ సోవియట్ యూనియన్ వంటి దేశాల క్లబ్‌లో భారతదేశం చేరుతుంది. ‘చంద్రయాన్-3’ కార్యక్రమం కింద ఇస్రో చంద్రుని ఉపరితలంపై ‘సాఫ్ట్-ల్యాండింగ్’, చంద్ర భూభాగంలో రోవర్ రొటేషన్‌ను దాని చంద్ర మాడ్యూల్ సహాయంతో ప్రదర్శించడం ద్వారా కొత్త సరిహద్దులను దాటబోతోందని అంతరిక్ష సంస్థ తెలిపింది. చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం–3 సిద్ధమవుతోంది.
*కన్న కూతుళ్లను బలిపెట్టిన కసాయితల్లి.. రెండో భర్తకు పిల్లలు పుట్టాలని..
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. భర్త అనారోగ్యంతో 2007లో ప్రాణాలు కోల్పోయాడు. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43)ను వివాహం చేసుకుంది. పిల్లలిద్దరినీ విశాఖపట్నంలోని తన పుట్టింటికి పంపించేసింది. ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పడంతో.. ఆమె తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని సూచించింది. పుట్టింటి వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్లను తీసుకొచ్చింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది. ఆ చిన్నారి ప్రతిఘటించినా వారిద్దరూ కలిసి చావబాదారు. ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు. ఆ బాలిక పదోతరగతికి రావడంతో ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 17 ఏళ్ల వయస్సులో ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సతీష్ మగబిడ్డ కావాలని చెప్పడంతో తన రెండో కూతురు(16) ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చ డంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు. ఇటీవల సతీష్‌కు, ఆమెకు మధ్య గొడవలు రావడంకో తన పుట్టింటికి వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఆ తర్వాత సతీష్ అతని వద్ద ఉన్న తన భార్య కూతుళ్లిద్దరినీ తీసుకుని వచ్చాడు. అక్కడ ఆమె లేకపోవడంతో కుమార్తెలిద్దరినీ శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలికల మేనమామ అక్కడకు చేరుకుని బాలికలను తీసుకెళ్లి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి పుట్టా సతీష్, అతని భార్యను అదుపులో తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు మూడో నెల గర్భిణీ అని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికల జీవితాలతో ఆ కసాయి తల్లి ఆడుకుందని మండిపడుతున్నారు.
*పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
వైఎస్సార్‌సీపీ పార్టీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. రమేష్ బాబు మంచి నాయకుడు అని, ఆలోచన చేయకుండా రాజీనామా చేయడం కరెక్ట్ కాదన్నారు. పార్టీలో ఆవిర్భావం నుంచి చాలా మంది ఉన్నారని.. సీఎంను కలవాలి అన్నప్పుడు తనతో మాట్లాడితే తప్పకుండా చర్చించేవాళ్లమన్నారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో మెప్మా మార్కెట్ ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబారెడ్డి పంచకర్ల రాజీనామాపై స్పందించారు. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేస్తూ చెప్పిన కారణాల గురించి ఆయన ప్రస్తావించారు. రమేష్ బాబు నిర్ణయం తీసుకునే ముందు పార్టీ ఇంఛార్జిగా తాను ఇక్కడ ఉన్నందుకు చర్చించి ఉంటే బాగుండేదన్నారు. జిల్లా అధ్యక్షుడిగా రమేష్ బాబు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ కూడా తాను పరిష్కరించానన్నారు. ప్రజా సమస్యలపై స్పందించట్లేదు అని రమేష్ బాబు చెప్పిన మాటలు వాస్తవం కాదన్నారు. వైసీపీ పార్టీ వ్యవస్థాపక దినం నుంచి ఉన్న వారిని కూడా పక్కనపెట్టి రమేష్ బాబుకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు చాలా బాగున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, నాయకులు కొనియాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
*హైదరాబాద్ మెట్రో రైళ్లకు అదనపు బోగీలు
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మెట్రోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో ప్రారంభంలో రోజుకు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. అయితే ఇప్పుడు రోజూ 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. ట్రాఫిక్ సమస్యను నివారించడంతోపాటు త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడం వల్ల చాలా మంది మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సొంత వాహనాలు ఉన్నవారు సైతం ట్రాఫిక్ దృష్ట్యా వాటిని పక్కన పెట్టి త్వరగా కార్యాలయానికి చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేదు. అలాంటి సమయాల్లో తదుపరి రైలు కోసం వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో మెట్రో రైళ్ల బోగీల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు వారి కోరిక నెరవేరనుంది. ఆగస్టు నాటికి మూడు అదనపు కోచ్‌లను మెట్రో రైళ్లకు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అదనపు కోచ్‌లను కొనుగోలు చేయడానికి సమయం పట్టవచ్చు. అందుకే కోచ్‌లను అద్దెకు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు చెన్నై, నాగ్ పూర్ మెట్రో అధికారులతో అద్దెకు మాట్లాడుతున్నారు. ఆగస్టు నాటికి మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లు రానున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి. అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసినా మెట్రో రైళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌ల పొడవు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇతర మార్గాలతో పోలిస్తే ఎల్‌బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ మార్గంలోని అన్ని రైళ్లకు త్వరలో మూడు అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లలో మూడు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆరబోగి మహిళలు, వృద్ధులకు ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఇవి కాకుండా మిగతా ప్రయాణికులకు సీటింగ్ సరిపోవడం లేదు. ఇప్పుడు మరో ముగ్గురు కోచ్‌ల చేరికతో మొత్తం కోచ్‌ల సంఖ్య ఆరుకు చేరుతుంది. దీంతో సీటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మెట్రో విస్తరణకు కూడా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
*ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!
ప్రస్తుతం భారతదేశం అంతటా ‘టమాటాలు’ పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఎవరిని కదిలించినా టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం టమాటాల ధర ఎక్కసారిగా పెరగడమే. కిలో టమాటాల ధర కొన్ని రాష్ట్రాల్లో రూ. 200 ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ. 150కి పైగా ఉంది. దాంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల దృష్ట్యా టమాటాలు కూడా విలాస వస్తువుల జాబితాలో చేరిపోయాయి. టమాటాలకు ఉన్న ఈ డిమాండ్‌ను పలు సంస్థలు సొమ్ముచేసుకోవాలి చూస్తున్నాయి. దేశంలోని పలు వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘టమాటా’ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తాజాగా మధురైలోని ఓ దేశీయ విమాన సంస్థ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ అంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్‌కు 1 కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది. ఈ కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించడం గమనార్హం. తమ వ్యాపారానికి టమాటాలు బాగా సహాయపడ్డాయని సదరు ఏజెన్సీ యాజమన్యం సంతోషం వ్యక్తం చేసింది. జూలై 11, 12 తేదీల్లో ఈ ఆఫర్ చాలా మంది కస్టమర్‌లను ఆకర్షించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఉందో లేదో తెలియరాలేదు. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. టమాటా ధరలను పలు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.
*నిర్మల సీతారామన్‌కు పార్టీలో కీలక బాధ్యతలు..?
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులను మార్పు చేయడమే కాకుండా.. రాష్ట్రాల ఇన్‌ఛార్జ్ లను మార్చడం.. రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్ లను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్‌ని మార్చి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పటికే వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజును తొలగించి.. ఆయన స్థానంలో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని నియమించారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు రాష్ట్రంపై బీజేపీ హైకమాండ్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు అన్నామలై గురువారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో కీలక బాధ్యతలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయ స్థాయిలో బీజేపీ అధిష్టానం పార్టీ పరంగా కీలక మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులుగా సీనియర్లను, కేంద్ర మంత్రులను నియమిస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తమిళనాట తమ సత్తా చాటే దిశగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇప్పటికే 11 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పార్టీ పరంగా కార్యక్రమాలను విస్తృతం చేశారు. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై రూపంలో కూటమికి బీటలు వారుతున్నాయనే బెంగ బీజేపీ జాతీయ అధిష్టానంలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పరోక్షంగా ఒంటరిగా సత్తా చాటేందుకు సిద్ధం లేదా, తమ నేతృత్వంలో కూటమి అన్నట్లు అన్నామలై తీరు ఉంటోంది. దీనిని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, ఎన్‌డీఏలో కీలకంగా ఉన్నా అన్నాడీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అన్నామలైకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. అన్నాడీఎంకే నిర్ణయాలను ఇతర మిత్రులు అనుసరిస్తున్నా, అన్నామలై రూటు సపరేటు అన్నట్లుగా ఉంటోంది. ఇది బీజేపీ జాతీయ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టి ఉంది. ఇప్పటికే అన్నామలైకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేతలు జాతీయ అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వేళ అన్నామలై రూపంలో ఎక్కడ కూటమికి బీటలు వారుతాయో అనే బెంగ బీజేపీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
*ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం..
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది. ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారంను ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అందించారు. దేశ అత్యున్నత గౌరవ పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్ ను దేశాధ్యక్షుడు మక్రాన్ మోడీకి అందించారు. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్’ను అందించారు. ఎలిసీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఫ్రాన్స్ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమైనది. ఒక దేశ ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, ఫ్రాన్స్ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ కార్యదర్శి బుట్రోస్ ఘాలీలు గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. ‘ప్రధాని మోదీకి ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్‌ను ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందించారు. కోట్లాది మంది భారతీయుల తరఫున మేక్రాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు’ అంటూ భారత విదేశాంగశాఖ ట్వీట్ చేసింది. ఇది సైనిక లేదా పౌర ఆర్డర్‌లలో అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు.ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది, అక్కడ మాక్రాన్ ప్రధాని మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 13 జూలై 2023న ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్, హెచ్.ఈ. మిస్టర్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అందించారు. ఈ ఏక గౌరవానికి ప్రెసిడెంట్ మాక్రాన్‌కి భారత ప్రజల తరపున ప్రధాని ధన్యవాదాలు తెలిపారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
*ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు
ఇతర దేశాలకు వెళితే మన రూపాయి చెల్లుబాటుకాకపోవడంతో.. మన కరెన్సీని అక్కడి స్థానిక కరెన్సీలోకి మార్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక ఫ్రాన్స్ కి వెళ్లిన వారు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపై పారిస్‌లో మన రూపాయి చెల్లుబాటు కానుంది. అలాగే ఫ్రాన్స్ లో మన యూపీఐ సేవలు కొనసాగనున్నాయి. దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులదే హవా. నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ సాంకేతికతపై ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. దీనికి నిదర్శనం గతేడాది ప్రపంచంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ తొలి స్థానంలో నిలవడం. సరికొత్త ఆవిష్కరణలు, దేశం నలుమూలలా వినియోగంతో భారత్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలను విదేశాలకు విస్తరించే పనిలో కేంద్రం నిమగ్నమై ఉంది. ఫ్రాన్స్‌లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లోని ప్రవాసీ భారతీయులతో గురువారం సమావేశమయ్యారు. భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’(UPI) సేవలు ఇక ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయని మోడీ తెలిపారు. ‘ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.. త్వరలోనే ఈఫిల్ టవర్ (Eiffel Tower) వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయి.. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో యూపీఐను అనుమతించడం వల్ల భారతీయులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గజిబిజిగా ఉన్న ఫారెక్స్ కార్డ్‌లు వినియోగం, నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను 2016 ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు దేశంలో విశేషంగా ప్రాధాన్యం పొందాయి. యూఏఈ, భూటాన్, నేపాల్‌లో వంటి దేశాల్లోనూ యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. గతేడాది ఎన్పీసీఐ, ఫ్రాన్స్‌లు ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ లైరా అని పిలిచే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే ఈ ఏడాది యూపీఐ, సింగపూర్‌కి చెందిన PayNow మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల్లోని వినియోగదారులు దీని ద్వారా లావాదేవీలకు అనుమతించారు. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్‌పీసీఐ చర్చలు జరుపుతోంది.
*అమెరికాలో డీమోనిటైజేషన్.. 500, 1000 నోట్లు రద్దు
2016 సంవత్సరం నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటలకు… దేశంలో పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. రాత్రి 12 గంటల తర్వాత 500, 1000 నోట్లను నిలిపివేసి వాటిని బ్యాంకుల్లోకి చేర్చే పనిలో పడ్డాడు. దేశంలో పెద్ద నోట్ల రద్దు చర్చ అన్ని చోట్లా మొదలైంది. అయితే డీమోనిటైజేషన్ అనేది ప్రపంచంలో కొత్త పదం కాదు. ఇంతకు ముందు కూడా మన దేశంలో కాకుండా చాలా దేశాల్లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. జూలై 14న అమెరికాలో డీమోనిటైజేషన్ జరిగింది. ఈ సమయంలో భారతదేశం వలె అమెరికాలో 500, 1000 పెద్ద కరెన్సీ నోట్లను నిషేధించారు. అమెరికాలో డీమోనిటైజేషన్‌కు కారణం వేరే ఉంది. అమెరికా డీమోనిటైజేషన్‌కి ఇండియా డీమోనిటైజేషన్‌కి తేడా ఎలా ఉందో తెలుసుకుందాం. అమెరికాలో ఈ రోజున, జూలై 14, 1969న ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ పెద్ద నోట్ల రద్దును ప్రకటించాయి. అదే రోజున అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ 500, 1000, 5000, 10,000 డాలర్ల నోట్ల చెలామణిని, వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నోట్లను చాలా తక్కువగా వినియోగించడమే నోట్ల రద్దుకు కారణం. ఈ నోటు రిజర్వ్ బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించబడింది. ఈ బ్యాన్ నోట్లను సామాన్య ప్రజలు ఉపయోగించుకోలేకపోయారు. తర్వాత ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రవేశపెట్టిన కారణంగా అధిక నగదు లావాదేవీల ఆచారం తగ్గింది. భారత్‌లోనూ 2016లో ప్రధాని మోదీ 500, 1000 నోట్లను రద్దు చేశారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అయితే దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం మార్కెట్‌లో రూ.500, రూ.2000 కొత్త నోట్లను విడుదల చేసింది. పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు సమయం కూడా ఇచ్చారు. నోట్ల రద్దు సమయంలో పాత నోట్లను కొత్త నోట్లతో మార్చుకునేందుకు, చిన్న నోట్లను తీసుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల బయట పెద్ద క్యూలు ఏర్పడడం ప్రారంభమైంది. ఇంతకు ముందు కూడా దేశంలో చాలాసార్లు పెద్ద నోట్ల రద్దు జరిగింది. గతంలో 500, 1000, 5000, 10000 నోట్లను మూసివేశారు. అయితే డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ కారణంగా నగదు రూపంలో లావాదేవీలు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రూ.2000 నోట్ల చలామణిని కూడా నిలిపివేసింది. సెప్టెంబర్ 30లోగా ప్రజలు ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి ఇతర నోట్లను తీసుకోవాలి.
*రష్యాలో పఠాన్… మొదటి రోజు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు
సెప్టెంబర్ 7న ఇండియన్ బాక్సాఫీస్ పై జవాన్ గా దాడి చేయడానికి రెడీ అయిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ప్రస్తుతం రష్యాలోకి పఠాన్ గా ఎంటర్ అయ్యాడు. 2023 జనవరి 25న ఇండియాలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులని చెల్లా చెదురు చేసి కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా రిలీజ్ అయిన పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవం తెచ్చింది. బాయ్కాట్ ట్రెండ్ కారణంగా క్రైసిస్ లో ఉన్న బాలీవుడ్ ని షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో రివైవ్ చేసేసాడు. పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ తన బాక్సాఫీస్ స్టామినా ఎప్పటికీ తగ్గదని నిరూపించాడు. పదేళ్లు హిట్ అనేదే తెలియకుండా, ఐదేళ్లు అసలు సినిమాలే చేయకుండా ఇంట్లో ఉంటూ వచ్చిన ఒక హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇచ్చిన దాఖలాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే లేదు అంటే అతిశయోక్తి కాదేమో. పఠాన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న సమయంలో నార్త్ లో మరో సినిమా దాదాపు నెల రోజుల పాటు థియేటర్స్ లో కనిపించలేదు అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే రష్యాలో మాత్రం ఈ జోష్ కనిపించట్లేదు. మొదటి రోజు రష్యాలో పఠాన్ సినిమా 600K రష్యన్ కరెన్సీని మాత్రమే రాబట్టింది. ఇది బాహుబలి 2 (430K) కన్నా ఎక్కువే కానీ షారుఖ్ రేంజ్ కి మాత్రం చాలా తక్కువ. కేవలం అయిదున్నర లక్షలు రాబట్టిన పఠాన్ సినిమా మొదటి రోజు కనీసం రిలీజ్ కి అయిన ఖర్చులని కూడా రాబట్టలేకపోయింది. పేరుకి మాత్రం పఠాన్ సినిమా ఇండియాస్ టాప్ డే 1 గ్రాసర్ గా నిలిచింది. మరి ఫుల్ రన్ లో అయినా పఠాన్ సినిమా రిలీజ్ ఎక్స్పెన్సెస్ ని అయినా వసూల్ చేస్తుందా? లేక నామ్ కే వాస్తే ఎంతోకొంత రాబడుతుందా అనేది చూడాలి.