బాలయ్యకు ఇదే నా సవాల్.. మా ఊరిగొడవలతో మీకేం పని?
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. సినీనటుడు బాలకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయ్. ఏదో ఒకటి మాట్లాడటం తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటు. కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘటనపై ఆయన మాట్లాడారు. తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు కోసం భాస్కర్ రెడ్డి చందాలు వసూలు చేశాడన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. నరసరావు పేటలో కూడా చందాలు వసూలు చేసి ప్రభ కట్టాడు. తిరునాళ్లకు కూడా తీసుకెళ్లకుండా మధ్యలోనే ప్రభ నిలిపివేశాడు.. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతీ విషయంలోనూ న్యూసెన్సు చేస్తుంటాడు. చందాలిచ్చిన వారు కూడా నాకు అతని పై ఫిర్యాదులు చేశారు. మాకు వార్నింగ్ ఇవ్వడానికి మీరెవరు బాలకృష్ణ. మా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడటానికి మీకేం పని? ఏదైనా మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలి. నువ్వు హీరోవైతే మీ టీడీపీకి గొప్ప నాకు కాదు. మా నియోజకవర్గంలో జరిగిన విషయం పై స్పందించడానికి మీరెవరు ? ఏదైనా మాట్లాడే ముందు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. బాలకృష్ణకు ఇదే నా సవాల్.. జరిగిన సంఘటనపై చర్చించేందుకు నేను సిద్ధం.. ఓ పనికిమాలిని వెధవకు వత్తాసు పలికి బాలకృష్ణ దిగజారొద్దు. మనుషులకు మూడోకన్ను ఉండదు. బాలకృష్ణ కూడా మనిషే. సినిమాల్లో మాదిరి నటన రాజకీయాల్లో కుదరదని బాలకృష్ణ తెలుసుకోవాలని హితవు పలికారు శ్రీనివాసరెడ్డి.
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బడ్జెట్ సమయం వచ్చేసింది. ఏపీ ఆర్థికమంంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన లెక్కల చిట్టా రేపు అసెంబ్లీలో విప్పనున్నారు. అసెంబ్లీ లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇటు శాసనమండలి లో ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 8 గంటలకు మొదటి బ్లాక్ లో జరుగనున్న సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ను ఆమోదించనుంది మంత్రి మండలి. ఇదిలా ఉంటే ఉదయం 7:30 గంటలకు బడ్జెట్ ప్రతులకు పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ తన ఛాంబర్ లో పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన. 2023-24 ఏడాదికి ఏపీ ప్రభుత్వ బడ్జెట్ గురువారం ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్థికపరమైన విమర్శలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో సంక్షేం.. అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. ఉభయ సభల్లో ఒకే సమయానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రులు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్టులో వివిధ శాఖలకు కేటాయింపులు ఏ విధంగా ఉంటాయోననే అంశంపై ఆసక్తి నెలకొంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్టును గురువారం సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో బడ్జెట్టు ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణ బడ్జెట్టును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టాక.. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్టును మంత్రి కాకాని ప్రజెంట్ చేయనున్నారు. ఈసారి మాత్రం సుమారు రెండు లక్షల 65 వేల నుంచి 70 వేల కోట్ల మధ్య బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఎన్నికలుండటంతో ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. అంతేకాదు ఎన్నికల బడ్జెట్ కావడంతో గతం కంటే ఎక్కువ కేటాయింపులతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
కోటంరెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్
వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్నటి వరకు మా సహచరుడు.. కోటంరెడ్డి కి నా సవాల్.. నీ ముఖానికి రంగు, రూపు రావటానికి కారణం వైఎస్ జగన్. ఆయన ఇచ్చిన టికెట్ పై గెలిచి ఇవాళ చంద్రబాబుతో రహస్యంగా లాలూచీ పడ్డావు. సిగ్గు ఉంటే, మగాడివి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అన్నారు సుధాకర్ బాబు. నెల రోజుల ముందే నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకు వచ్చింది. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో నీ నియోజకవర్గ అభివృద్ధి ఎంత జరిగింది?? అని ఆయన ప్రశ్నించారు. జగన్ నీ నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో ఎంత నిధులు ఇచ్చారో చర్చకు రా. నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలుసు. చెప్పులు వేసుకోవటం మరిచిపోయి స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళాడు. మేం దాడి చేశాం అనటం పచ్చి అబద్ధం. ఉదయం నుంచి ఆయన కాళ్ళు, చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఆయన పట్టుకున్న కాగితం చేతిలో నుంచి జారిపోతే తీసుకుని వెళ్ళి స్పీకర్ కు హ్యాండ్ ఓవర్ చేశాం అన్నారు సుధాకర్ బాబు.
కాఫీ అతిగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది. బీఎంజే మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం కెఫిన్ ఉపయోగాలను వెల్లడించింది. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ తగ్గించేందుకు క్యాలరీ ప్రీ కెఫిన్ పానీయాలు ఉపయోగపడుతాయని వెల్లడించింది. అయితే దీనికి మరిన్ని పరిశోధనలు అవసరం అని తెలిపింది. సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ శరీరం తగినంత ఇన్సులిన్ హార్మోన్ విడుదల చేయనప్పుడు ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా కాఫీలు తాగడం గురించి అధ్యయనం చేయడం లేదని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఈ పరిశోధన ఉద్దేశ్యం కాదని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌లోని సీనియర్ లెక్చరర్, పరిశోధకుడు డాక్టర్ కటారినా కోస్ అన్నారు. మెండెలియన్ రాండమైజేషన్ అనే సాంకేతికను ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఇది జెనటిక్ ఎవిడెన్స్ ద్వారా కారణాలను, ప్రభావాన్ని తెలియజేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కెఫిన్ ఎక్కువగా జీవక్రియ వేగంతో సంబంధం కలిగి ఉన్నట్లు, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్, శరీర కొవ్వుతో సంబంధం కలిగి ఉన్నట్లు తేల్చింది. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ బరువు తగ్గడం వల్ల అరికట్టవచ్చని, జీవక్రియ రేటును పెంచడానికి శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, ఆకలిని తగ్గించడానికి కెఫిన్ ఉపయోగిపడుతున్నట్లు కనుగొనబడింది. ప్రతీ రోజూ 100 ఎంజీ కెఫిన్ తీసుకోవడం వల్ల 100 కేలరీల శక్తి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని వార్విక్ యూనివర్సిటీ అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీఫఎన్ లారెన్స్ మెండెలియన్ తెలిపారు.
సభ నుంచి సరే… ప్రశ్నించే గొంతుల్ని సస్పెండ్ చేయగలరా?
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. పొరుగు రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరుగుతున్న అన్యాయం వివరిస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది.సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ ప్రశ్నించే గొంతును సస్పెండ్ చేయలేరు. కర్ణాటక నిర్మించే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ప్రశ్నించలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఎగువన నిర్మించే అక్రమ ప్రాజెక్టులు వల్ల ఎంత నష్టమో వివరించానన్నారు. తెలంగాణా, కర్ణాటకల్లో ఉన్న తమ ఆస్తులు కాపాడుకునేందుకే, ప్రభుత్వ పెద్దలు రాయలసీమను నాశనం చేసే అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదు.మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం భయపడి సస్పెండ్ చేసింది.అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే కర్నూలు, అనంతపురం జిల్లాలు ఎం కావాలి..?రాయలసీమ జిల్లాల భూములు శాశ్వతంగా బీడు మారే ప్రమాదాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు.గవర్నర్ చేత ప్రభుత్వం చెప్పించిన అసత్యాలని మాత్రమే మేం ఎత్తి చూపాం. మాజీ గవర్నర్లు, మండలి ఛైర్మన్ షరీఫులను ఘోరంగా అవమానించిన వైసీపీ నేతలా మాకు నీతులు చెప్పేది.మంత్రి చెప్పే బుర్రకథలు వినేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు.టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నా సీట్లో నుంచి కదలని నన్ను సస్పెండ్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సింహం సింగిల్ గా వస్తుందని చెప్పుకునే వారు మా సభ్యులకు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ మార్గం ఎంచుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు అసెంబ్లీలో ఆధారాలతో సహా ఎండగడతామనే మమ్మల్ని సస్పెండ్ చేశారు.రానున్న రోజుల్లో అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టలేని విధంగా జగనుకి బుద్ధి చెప్తాం అన్నారు రామానాయుడు.
లీకులు షురూ.. దేవుడిగా పవన్ లుక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు. ఇక గత నెల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ దేవుడుగా కనిపిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవుడున్నాడు అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారట. ఇక పవన్ మిగతా సినిమాలను పక్కన పెట్టి ముందు ఈ సినిమాను ముగించాలని చూస్తున్నాడు. ఎందుకంటే పవన్ అతి తక్కువ కాల్షీట్స్ ఇచ్చిన సినిమా ఇదే. అందుకే త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు.పెద్ద సినిమా ఎక్కడ షూట్ చేస్తున్నారా..? అక్కడ కెమెరాలు పెట్టేస్తాం.. మొబైల్ ఫోన్స్ తో ఊడిపోతాం అన్నట్లు ఉంటారు కొంతమంది. హీరో లుక్, సీన్స్ ను రహస్యంగా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో లీకులు పెట్టేస్తారు. ఈ సమస్యను ప్రతి స్టార్ హీరో ఎదుర్కొంటున్నాడు. తాజాగా పవన్- తేజ్ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఇంకా సగం షూటింగ్ కూడా అవ్వలేదు అప్పుడే పవన్ లుక్ అంటూ ఇంటర్నెట్ లో లీకు ఫోటోలు వదిలేశారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సోషల్ మీడియాలో అపరిచితు వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని రాచకొండ కమిసనర్ డిఎస్ చౌహాన్ యువతకు సూచించారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల అవసరాలకు ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు ఉపయోగించడం జరుగుతుందని.. వాటి వల్ల పలు రకాల మార్గాల్లో జరిగే నేరాల వల్ల ఎంతో మంది బాధితులు నష్టపోతున్నారని కమిషనర్ చౌహాన్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థలలో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలని, సరైన సెక్యూరిటీ లేని ప్రదేశాల్లో అటూ వంటి కార్డులు వీలైనంత వరకు ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాటరీలో డబ్బు గెలుచుకున్నారని వచ్చే మోసపూరిత, ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో యువత అజాగ్రత్తగా ఉండడం వల్ల.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మీకు సోషల్ మీడియాలో ఎటువంటి వేధింపులు ఎదురైనా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి.. మీకు తగిన న్యాయం పోలీసులు చేస్తారని తెలిపారు. అవసరమైన పక్ష్లో పోలీసుల వివరాలు గోప్యంగా ఉంచుతారని ఆయన వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించడం ద్వారా సైబర్ నేరాల మీద ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్.. మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. ఎవరి సాయం లేకుండానే పంత్ ధీమాగా నడవగలుగుతున్నాడు. గతంలో ఓ చిన్న చేతికర్రతో నడుస్తున్న వీడియో షేర్ చేసిన రిషబ్ పంత్ ఇప్పుడు.. వాట్ పూల్ లో నడిచిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. చిన్న విషయాల మధ్యలో ప్రతీదానికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు.. గాయం తర్వాత తన హెల్త్ కు సంబంధించిన అప్టేట్స్ ఇస్తున్న పంత్.. తాజాగా ఈ వీడియోను విడుదల చేసి తాను కోలుకుంటున్నాననిని చెబుతున్నాడు. నెల రోజుల క్రితం పంత్ తన ఇన్ స్టా గ్రామ్ లో.. ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా అని రాసుకొచ్చాడు. కార్ యాక్సిడెంట్ తర్వాత నాలుగు రోజుల పాటు ఉత్తరాఖండ్ లోనే చికిత్స పొందిన పంత్ కు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బీసీసీఐ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంది. పంత్ గైర్హజరీలో బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో అతడు లేని లోటు స్పష్టంగా తెలిసిందని నెటిజన్స్ వాపోతున్నారు. నాగ్ పూర్, ఢిల్లీ, ఇండోర్ లలో టెస్టులో కూడా చాలా మంది అభిమానులు పంత్ వి మిస్ యూ అని ప్లకార్డులు పట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాపై పంత్ కు మంచి రికార్డు ఉంది. గాయం కారణంగా పంత్ ఐపీఎల్, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ వంటి కీలక టోర్నీలు మిస్ కానున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ వరకైనా రిషబ్ పంత్ కోలుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
తినండి.. తాగండి.. సె..చేయండి.. విద్యార్థులకు ఆర్జీవీ పాఠాలు
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న.. ఆయనకు ఏది అనిపిస్తే అది చెప్తాడు. ఏది అనిపిస్తే అది చేస్తాడు. ట్విట్టర్ లోనే కాదు మైక్ ముందు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంలో వర్మ దిట్ట. నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. కాలేజీ విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి అనే సిద్ధాంతం తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకురావడమే కాకుండా తినండి.. తాగండి.. సెX చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది. వర్మను గెస్ట్ గా పిలిచిన ఆ కాలేజ్ ఏంటిది అనేది తెలుసుకుందాం. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నేడు అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 అనే ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యాడు. ఇక వర్మను చూడగానే స్టూడెంట్స్ రెచ్చిపోయారు. స్టార్ హీరోలు ప్రీ రిలీజ్ కు వస్తే ఎలా అరుస్తారో ఆ రేంజ్ లో స్టేడియం మొత్తం ఆర్జీవీ పేరుతో మారుమ్రోగిపోయింది. ఇక ట్విట్టర్ లో ఒకలాగా.. స్టూడెంట్స్ తో మరోలా మాట్లాడితే ఆర్జీవీ ఎలా అవుతాడు. అందుకే ఇక్కడ కూడా తన సెX పురాణం మొదలుపెట్టాడు. “సాధారణంగా ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వచ్చాం అని చెప్తారు. దాన్ని నేను నమ్మను. స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోండి. మనం చేసే పనిని పక్కవాడితో చేయించేలా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి. నేను కాలేజ్ కు వచ్చాను కదా అని నేనో పెద్ద గొప్ప స్టూడెంట్ ను అని అనుకోవద్దు. నేను కాలేజ్ కు వచ్చి బ్యాక్ బెంచ్ లో కూర్చొని నోవెల్స్చదివేవాడిని. కనకదుర్గమ్మ టెంపుల్ కు వెళ్లి అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని.