రేపే తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఇనుమడింపజేసేలా కొత్త సచివాలయం నిర్మించుకున్నామని కేసీఆర్ అన్నారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలను సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే. ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త సచివాలయా ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగనుంది. ఆ తరువాత నేరుగా 6వ అంతస్తులో ఉన్న తన ఛాంబర్ లో సీఎం కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు తమతమ ఛాంబర్లలో అడుగుపెట్టనున్నారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనుంది.
చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక వైపు వేసవి తీవ్రత ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం వేడి రాజుకుంటోంది. తాజాగా జరిగిన పరిణామాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మూడోసారి చంద్రబాబు.- పవన్ భేటీ జరిగింది.ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు-పవన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల పైనా బాబు-పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న వేళ ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వీరు భేటీ కాగా తాజా భేటీపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపైనే అందరి కళ్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చేశారు. దీంతో పవన్ కు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు భేటీ అయ్యారు. అప్పటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్, ఈ విధంగా ఒకరికొకరు కలుసుకుని సంఘీభావం తెలుపుకుంటున్నారు.
చెన్నై ఎయిర్ పోర్టులో పాముల కలకలం
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.చెక్ ఇన్ సమయంలో పాములతో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లను తనిఖీ చేయగా అందులో పాములు బయటపడ్డాయి. వీటిలో బ్యాగు నుంచి ఊసరవెల్లిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మలేషియా కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద 22 రకాల పాములను గుర్తించినట్లు, మహిళను అరెస్ట్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ ట్వీట్ చేసింది. 1962 r/w వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. కస్టమ్స్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని అక్కడ నుంచి తరలించారు.ఈ ఏడాది జనవరి నెలలో కూడా ఇలాగే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు, కోతులు, తాబేళ్లు ఉన్న కంటైనర్లను అధికారులు పట్టుకున్నారు. ఫైథాన్, చుక్కల తాబేళ్లు, 8 కార్న్ పాములను పట్టుకున్నారు. బ్యాంకాంగ్ నుంచి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు మాజీ మున్సిపల్ చైర్మన్ బసవ రేవతి.. నూజివీడు గురుదత్త ఆశ్రమం వద్ద 2 ఎకరాల 79 సెంట్లు స్థలం విషయంలో వివాదం చెలరేగింది. దీంతో బసవ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బసవ కుటుంబ సభ్యులకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న వారిని అరెస్ట్ చేశారంటూ ఆందోళనకు దిగారు వైఎస్సార్సీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ బసవా రేవతి. నూజివీడు స్టేషన్ ఖాళీ లేకపోవడంతో వీరిని అరెస్ట్ చేసి ఇక్కడకు తరలించారా అంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న ఆమె వద్ద మీడియా వారు వివరణ తీసుకుంటున్న తరుణంలో దురుసుగా ప్రవర్తించారు నూజివీడు పట్టణ ఇన్ ఛార్జి సీఐ సత్యనారాయణ ….మీడియాతో తీవ్ర వాగ్వాదానికి దిగిన పట్టణ ఇన్ ఛార్జి సిఐ సత్యనారాయణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంలో పోలీసులు అతిగా జోక్యం చేసుకుని నా బిడ్డలను అక్రమ అరెస్ట్ చేశారంటూ బసవా రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
రేపు కీలకమయిన ఫైల్ పై మంత్రి కేటీఆర్ సంతకం
రేపు ( ఆదివారం ) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అత్యంత కీలకమైన ఫైల్ మీద తన మొదటి సంతకం చేయనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలు మీద నూతన సచివాలయంలో కేటీఆర్ తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు ( ఆదివారం ) మంత్రి కే. తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలోని మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలు పైన మంత్రి కేటీఆర్ తొలి సిగ్నిచర్ చేయనున్నారు.హెచ్ఐసీసీలో జరిగినఫుడ్ కాంక్లేవ్-2023 ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు. తెలంగాణ సంక్షేమ, అభివృద్ది పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ స్టేట్ సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతున్నదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మత్య్స సంపదలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
టెక్సాస్ లో దారుణం..ఐదుగురిని కాల్చిచంపిన దుండగుడు
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తుల్లో 8 ఏళ్ల చిన్నారితో పాటు ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇంటి ముందు ద్వారం నుంచి బెడ్రూం వరకు బాధితులు మృతదేహాలు పడి ఉన్నాయి. చనిపోయిన వారంతా హోండూరస్ దేశానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నుంచి ఇద్దరు పిల్లలు ప్రాణాలతో భయటపడ్డారు. ఇద్దరు పిల్లల్ని రక్షించేందుకు ఇద్దరు స్త్రీలు వారిపై పడుకున్నట్టుగా అక్కడ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. దీంతో పిల్లలిద్దరు బుల్లెట్ గాయాల నుంచి రక్షించబడ్డారని పోలీసులు వెల్లడించారు. బాధితుల తల, మెడ భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో 10 ఉన్నారని పోలసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి మెక్సికోకు చెందిన వ్యక్తిగా, దాడి సమయంలో అతను తాగి ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు, అతడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బాధితులతో, నిందితుడికి ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై పోలీసులు ఎంక్వైరీ చేశారు.
రాజమండ్రిలో మే 27,28 తేదీల్లో మహానాడు
మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరుగనున్న మహానాడు వేదిక స్థలం టిడిపి బృందం పరిశీలించింది. బృందంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెయ్యనాయుడు , పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప ,గోరంట్ల బుచ్చియ్యచౌదరి , జిల్లాకు చెందిన టిడిపి ముఖ్యనేతలు విచ్చేసి పరిశీలిన చేశారు. జాతీయ రహదారికి అనుకుని రాజమండ్రి- రూరల్ వేమగిరిలో మహానాడు నిర్వహణకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు -అచ్చెం నాయుడు మీడియాతో మాట్లాడుతూ మహానాడు కోసం 15 కమిటీలు వేశామని తెలిపారు. ఈసారి ఏన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం శుభపరిణమమని పేర్కొన్నారు.ఈసారి మహానాడు మే 27 28 తేదీన రెండు రోజులు ఉంటుందన్నారు.27న ప్రతినిధుల సభ హైవేకి అవతల వైపు, 28న భారీ బహిరంగ సభ హైవేకి ఇవతల వైపు రెండు స్థలాల్లో పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.ఊహకందని విధంగా న భూతో.. న భవిష్యత్తు అన్న తీరులో రాజమండ్రిలో మహానాడు ఉండబోతుందని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం దిశగా మహానాడు ఉండబోతుందని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. 1994లో అధికారంగా లోకి వచ్చే ముందు రాజమండ్రిలోనే సభ పెట్టామని అన్నారు. మళ్ళీ ఏపిని అభివృద్ధిలో నడిపించే విషయాలు మహానాడులో రానున్నాయని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు జరిగే మహా నాడును పెద్ద ఎత్తున జరపబోతున్నామని. అన్నారు. రాజమండ్రిలో మహానాడుతో 175/175 గెలిచే దిశగా ముందుకు వెళ్ళబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
అవి ఎన్టీఆర్ ను చంపిన ఖూనీకోరుల సంబరాలు
ఏపీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పల్నాడులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు, తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. సినీ హీరో రజనీకాంత్ పై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. రజనీకాంత్ గొప్ప నటుడు కానీ అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదు. చంద్రబాబును పొగడడానికి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చాడనిపిస్తుంది. రజనీకాంత్ రాజకీయాలకు వస్తానని చెప్పి పారిపోయిన వ్యక్తి.. రాజకీయాలకు పనికిరాని పిరికిపంద అన్నారు. ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు చంద్రబాబు పక్కన రజినీకాంత్ కూడా ఉన్నాడని ప్రచారం ఉంది..ఎన్టీఆర్ ని పొగడకుండా చంద్రబాబును పోగడం ఆశ్చర్యకరం.సినీ నటుడు ఎన్టీఆర్ రాజకీయ పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని పొగడడం దుర్మార్గం అని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అని కాదు పేరు పెట్టాల్సింది.. ఎన్టీఆర్ ను చంపిన ఖూనీకోరుల సంబరాలు అని పెడితే సరిగ్గా సరిపోయేది. మీరే చంపి, మీరే దండేసి, మీరే దండం పెడతారు.. 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారత రత్న కోసం పోరాడతాడట అని ఎద్దేవా చేశారు. ఈ 27 ఏళ్ళల్లో 14 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు… కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబు అప్పుడు ఎందుకు అవార్డు ఇప్పించ లేదు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుతో చేతులు కలిపాడు రజనీకాంత్.. బావతో చేతులు కలిపి కన్నతండ్రి చావుకు కారణమైన బాలకృష్ణ ఇప్పుడు ఎన్టీఆర్ ని యుగ పురుషుడు అంటున్నాడని మండిపడ్డారు జోగి రమేష్.
ప్రతి కుటుంబానికి జగనన్న మేలు చేశారు
ఏపీలో ప్రతి కుటుంబానికి జగనన్న మేలు చేశారన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. పదివేల కోట్ల రూపాయల భారం మోస్తూ రూపాయి కే 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు ఇస్తున్నాం.టిడ్కొ ఇల్లలో అనేక సంస్కరణ లు తీసుకువచ్చారు. మౌళిక వసతులు లేకుండా ఇల్లు కేటాయించకూడదని బావించడంతో కాస్త ఆలస్యం అయిందన్నారు. రాజకీయ లబ్ది కొసం తూతూ మంత్రంగా టిడిపి నాడు ఇళ్ళు నిర్మించారు.ప్రతిఒక్క కుటుంబంలో జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగింది. చంద్రబాబు14 ఏండ్లు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పడు మహిళలను , యువతని మోసం చేసారన్నారు. 40 ఏండ్లు ఇండస్ట్రి అని చెబుతున్న వ్యక్తి చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.చంద్రబాబు తాను అధికారంలో ఉన్నసమయంలో ఏం చెయకుండా , నేడు మరో ఛాన్స్ అంటున్నారు.పవన్ కి ఆలోచనా విధానం , భావజాలం లేదు.ఇంకా చట్టసభల్లో అడుగుపెట్టలేదు . సింఎంగా ఒక అవకాశం అంటున్నారు. రాష్ర్ట ప్రజలకు ఏం చెయాలో , ఏమి చేస్తానని చెప్పలను కుంటారో తెలియని పరిస్దితి పవన్ ఉన్నారు. మీకుటుంబంలో మంచి జరిగిందా లేదా చూసుకొని , మీకు నమ్మకం ఉంటేనే జగన్ వైపు ఉండాలని కోరుతున్నాం. అక్కచెల్లెమ్మలు జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకొవాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఈ రకంగా విప్పి చూపించేది.. అందుకేనా పాప
ఓ.. సీతా వదలను ఇక కడదాకా.. అంటూ రామ్ అన్నట్లు.. తెలుగు ప్రేక్షకులు కూడా మృణాల్ ఠాకూర్ ను వదలకుండా గుండెల్లో పెట్టేసుకున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మృణాల్ ను అందరు సీత అంటూనే పిలుస్తున్నారు. అంతేకాదు.. మృణాల్ ఎంతగా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు అంటే .. ఆమెపొట్టి బట్టలు వేసుకున్నా, కొద్దిగా అందాల ఆరబోత చేసినా కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మృణాల్ చాలా రోజులు చీరలు, చుడీదార్ ల్లోనే కనిపించింది. కానీ, మృణాల్ లైఫ్ స్టైల్ అది కాదు. ఆమె బాలీవుడ్ నటి. ఫ్యాషన్ ఐకాన్.. నిత్యం మోడ్రన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి మృణాల్.. ఒక్కసారిగా సీతగా మారిపోవడం ఆమె ఉనికికే మచ్చ తీసుకు వచ్చేలా మారింది. ఇక దీంతో తన ఉనికికి కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది మృణాల్.. తానూ అన్ని పాత్రలకు సెట్ అవుతానని, గ్లామరస్ రోల్స్ తో పాటు అందాల ఆరబోతకు కూడా సై అని హింట్లు ఇస్తోంది. ఇక గత కొన్నిరోజులుగా మృణాల్ అందాల ఆరబోతకు హద్దులేకుండా పోతుంది. బికినీ దగ్గర నుంచి జీన్స్ వరకు అన్ని డ్రెస్ ల్లో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.