7రోజుల్లో 63 లక్షల కుటుంబాలకు.జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్
ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల వేడిని రాజేసినట్టే కనిపిస్తోంది. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రారంభించిన క్యాంపైన్ వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాలను కలిసినట్లు ప్రకటించింది వైసీపీ. జగన్ కు మద్దతుగా 47 లక్షల మందికి పైగా మిస్డ్ కాల్ చేసినట్లు వెల్లడించింది. క్యాంపైన్ ప్రాంరంభంచి వారం రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని వెల్లడించింది. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపైన్ కొనసాగనుంది. మెగా పబ్లిక్ సర్వే వివరాలను వైసీపీ ఈ నెల 21 తర్వాత ప్రజల ముందు పెట్టనుంది.అధికార వైసీపీ ఎన్నికల క్యాంపైన్ కసరత్తు ముమ్మరం చేస్తోంది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో పార్టీ నియమించిన దాదాపు 7 లక్షల మంది గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు సుమారుగా 63 లక్షలకు పై చిలుకు ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్పంచుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించటం ఈ కార్యక్రమం ప్రధాన ఎజెండా. దీనిలో భాగంగానే తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా , భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించ మంటరా అనే ఐదు రకాల ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమాధానాలే పార్టీకి క్షేత్ర స్థాయిలో ఈ ప్రభుత్వం పై ప్రజా అభిప్రాయం ఎలా ఉందో అర్థం చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వారం రోజుల్లో జగన్ పట్ల తమ మద్దతును వ్యక్తం చేస్తూ సుమారుగా 47 లక్షల మంది మిస్డ్ కాల్స్ చేశారని మంత్రులు ప్రకటించారు.
రాజుకుంటున్న శ్రీకనకదుర్గ ప్రభ మేగజైన్ వివాదం
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ.. కనకదుర్గమ్మ ఆలయం ఎప్పుడూ వివాదాల్లో ఉంటుంది. అధికారుల తీరు వల్ల భక్తులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. తాజాగా ఓ మేగజైన్ కథనం వివాదానికి ఆజ్యం పోసింది. అద్వైత వేదాంత సిద్దాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త అయిన ఆది శంకరాచార్యులు గురించి ప్రచురించిన కథనం ఆధ్యాత్మిక వర్గాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గ గుడి ఆధ్వర్యంలో శ్రీకనకదుర్గ ప్రభ మాసపత్రిక ప్రచురించబడుతుంది. ఈ మాసపత్రికకు దుర్గగుడిలోని ఉద్యోగి ఎడిటర్ గా విధులు నిర్వర్తిస్తాడు. ఆలయంలో పనిచేస్తున్న గంగాధర్ ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రచురించిన పుస్తకంలో ఆది శంకరాచార్యులు గురించి కథనం వ్రాసారు.. ఈ కథనం ఇప్పుడు దుమారం రేపుతుంది. ఆది శంకరాచార్యులు గోదావరి నదీతీర ప్రాంతపర్యటనలో శంకరులు సంచారం చేసినప్పుడు మీరు ఎవరు? మీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి ? అని కొందరు అడిగిన సమయంలో శంకరులు తన పేరు శంకరాచార్య, త్వష్ట విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మించాను అంటూ ఈ విధంగా సమాధానం చెప్పారని విదేశీయుడైన రచయిత శంకర విజయలో అల్ర్ఫెడ్ ఎడ్వర్ట్ రాబర్ట్స్ తెలియజేశారంటూ ప్రచురించారు.బ్రాహ్మణ వంశానికి చెందిన శంకరాచార్యులను విశ్వబ్రహ్మణ వంశానికి చెందిన వారిగా ప్రచురించడంపై ఆధ్యాత్మిక వర్గాలు మండిపడుతున్నాయి.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం…ట్రాక్టర్ బోల్తా పడి 12మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గర్రా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. 42 మందితో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా వంతెనపై నుంచి కింద పడింది. తిల్హార్ పోలీస్ స్టేషన్‌లోని బిర్సింగ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అజ్మత్ పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు సమీప గ్రామంలో ఏర్పాటు చేసిన భగవత్ కథకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రేపు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. తస్మాత్ జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత బాగా పెరుగుతోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఐఎండి అంచనాల ప్రకారం రేపు 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రకటన విడుదల చేశారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబితా ఈ విధంగా ఉంది,
అల్లూరి జిల్లా :- కూనవరం
అనకాపల్లి:- నాతవరం
కాకినాడ :- కోటనందూరు
మన్యం:-జీయమ్మవలస, కొమరాడ, పార్వతీపురం
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(174) అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కోడి కత్తి కేసులో NIA అధికారుల తీరు ఇంతేనా?
కొన్ని పచ్చ కుక్కలు అమాయకమైన కుక్కల్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాయి. 2018 లో జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి కత్తితో హత్యాయత్నం చేశాడు.హత్యాయత్నం జరిగిన గంటకు అప్పటి డీజీపీ వచ్చి హత్యాయత్నం వెనుక ఎవరు లేరు..అతను వైసీపీ కార్యకర్త అని చెప్పారు.మరో గంటకు అప్పటి సీఎం చంద్రబాబు వాళ్లకు వాళ్లే చేయించుకున్నారని చెప్పారు.NIA కూడా హత్యాయత్నం జరిగింది అని చెప్పింది…కానీ కుట్రకోణం లేదని చెప్పింది.కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా ఇంతలా మేనేజ్ చేయబడుతున్నాయి.ఎన్టీఆర్ పై దాడి జరిగితే హత్యాయత్నం… జగన్ పై హత్యాయత్నం జరిగితే కోడి కత్తి కేసా?జగన్మోహన్ రెడ్డి కావాలని దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.2003 లో చంద్రబాబుకు జరిగింది ఏంటి?తన పై హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరపమని పిటిషన్ వేశారు.పిటిషన్ వేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదా?చంద్రబాబుకి అన్నిచోట్ల స్లీపర్ సేల్స్ వున్నారు.సీబీఐ, NIA లో అధికారులను ప్రభావితం చేస్తున్నారు.విజయమ్మ, షర్మిళ, భారతమ్మ గురించి డీఎల్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతున్నారు.వైస్సార్ దగ్గర ఆషాడ భూతి లా బతికారు. NIA అధికారుల తీరుని ఖండిస్తున్నారు.చంద్రబాబు సొంత మనిషి శివాజీ తో గరుడపురాణం చెప్పించారు.చంద్రబాబు పై మాకు అనుమానం ఉంది.టీడీపీ నేతలు జగన్ పాలనను తుగ్లక్ పాలన అన్నారు…అంటే టీడీపీ నేతలు ముస్లింలను అవమానిచనట్లేనా?చంద్రబాబుకి కుక్క భాష వచ్చా?అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.
ఇస్లాంలోకి మారాలని లవర్ వత్తిడి,, యువతి ఆత్మహత్య
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్, 24 ఏళ్ల యువతితో రిలేషన్ లో ఉన్నాడు. సామాజికంగా ఎదురువుతున్న అవమానాన్ని తట్టుకోవాలంటే ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకో లేకపోతే చావు అని యువతికి చెప్పడంతో ఆమె బుధవారం తన ఇంట్లో సీలింగ్ హుక్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అసిస్టెంట్ సీపీ తేజ్ బహదూర్ సింగ్ తెలిపారు. బాధితురాలికి కొన్నేళ్ల క్రితం నిందితుడు షారూఖ్, సౌరభ్ అనే పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడని పోలీసులు గుర్తించారు.
కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. ఈటల కామెంట్స్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారానికి ఘోరీ కట్టాక.. హుజూరాబాద్ ప్రజలపై ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ సబ్ జైల్‌లో చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్‌తో కలిసిన తర్వాత మీడియాతో ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక శాడిస్ట్‌లా, సైకోలా ప్రవర్తిస్తున్నారని.. హుజూరాబాద్ పోలీసులు ప్రభుత్వ బానిసలుగా, అటెండర్‌లుగా పని చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు ఆపకపోతే.. ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మహేందర్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన.. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2023 వరకే కేసీఆర్ అధికారంలో ఉంటారని, ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడ చేస్తారో చూస్తామని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ అతి తక్కువ కాలంలో ప్రజల ఆస్తులు దోచుకొని లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. అక్రమ సొత్తుతో దేశంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూపల్లి, పొంగులేటి తన మిత్రులని.. బీఆర్ఎస్ నాయకులతోనూ తనకు ఫోన్ సంభాషణలు ఉన్నాయని.. అందరి ఎజెండా కేసీఆర్‌ని ఓడించడమేనని పేర్కొన్నారు.
ఏజెంట్ ట్రైలర్ వస్తోంది… ప్రమోషన్స్ లో ఫైర్ వచ్చింది
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మంచి జోష్ చేస్తున్నారు చిత్ర యూనిట్. స్పై యాక్షన్ సినిమాగా రూపొందిన ఏజెంట్ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ‘రామకృష్ణ’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసి యూత్ ని ఇంప్రెస్ చేసిన ఏజెంట్, యాక్షన్ సినిమాకి లోకల్ టచ్ ఇచ్చాడు. ఈ సాంగ్ యుట్యూబ్ లో మంచి వ్యూవర్షిప్ రాబడుతోంది. లేటెస్ట్ గా ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు.
పోనీలే ఇప్పటికైనా చోళులు వస్తున్నారు
చోళులు వస్తున్నారు అంటూ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఆడియన్స్ ముందుకి తెచ్చాడు. 500 కోట్లు కలెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా సక్సస్ తమిళ ప్రజలకి మాత్రమే పరిమితం అయ్యింది. పొన్నియిన్ సెల్వన్ 1 ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ బాగానే చేశారు కానీ సినిమా మొత్తం తమిళ వాసన ఉండడంతో ఇతర ప్రాంతాల ఆడియన్స్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాని రిజెక్ట్ చేశారు. పార్ట్ 2ని కూడా ఇలానే రిజెక్ట్ చేస్తారు అనుకున్నారో లేక తమిళ కథ తమిళ ఆడియన్స్ కోసం మాత్రమే ప్రమోషన్స్ చేస్తే చాలు అనుకున్నారో ఏమో కానీ ఇప్పటివరకూ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ కి ఇతర ప్రాంతాల్లో చెయ్యలేదు.