పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీపీఆర్‌కు కేంద్రంకు లేఖ
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్‌ఎల్‌ఐఎస్)కి సంబంధించి కేంద్రం పంపిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్రం తిరస్కరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, వెంటనే డీపీఆర్‌ను పరిశీలించి మంజూరు చేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పీఆర్‌ఎల్‌ఐఎస్ డీపీఆర్‌ను పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతి ఇచ్చేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇరిగేషన్) రజత్ కుమార్ లేఖ రాశారు. గతంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన సమస్యలన్నింటికీ ప్రాజెక్టు గురించి సవివరంగా వివరణ ఇచ్చామని, అందువల్ల డీపీఆర్‌ను పరిశీలించేందుకు కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కెడబ్ల్యుడిటి-II) ఈ అంశంపై తీర్పు ఇచ్చేంత వరకు డిపిఆర్‌ను పరిశీలనకు తీసుకోలేమని సిడబ్ల్యుసి వాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జస్టిస్ బ్రిజేష్ కుమార్ తమకు అధికారం లేదని చెప్పారని రజత్ కుమార్ గుర్తు చేశారు. నీటిని కేటాయించాలని, అందుకే డీపీఆర్‌ను పరిశీలించి ట్రిబ్యునల్ తుది తీర్పుకు లోబడి అనుమతులు ఇవ్వాలని కోరారు. 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం పాలమూరు-రంగారెడ్డిని అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని, ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని చెప్పామని తెలిపారు.
జగనన్నే మా భవిష్యత్తు షెడ్యూల్ పొడిగింపు
‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం షెడ్యూల్ ఈనెల 29 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సమాచారం పంపింది వైసీపీ కేంద్ర కార్యాలయం.. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో షెడ్యూల్ ని పెంచింది పార్టీ హైకమాండ్.. ఈ నెల 20 వరకే పూర్తి కావల్సి వుందీ కార్యక్రమం.. ప్రజల స్పందనతో మరో 9 రోజులు కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బిజీగా సాగుతోంది. స్ధానిక ప్రజాప్రతినిధులు సచివాలయ కన్వీనర్లు, గృహసారధులుతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టి మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్న పాలనలో జరుగుతున్న మంచిని మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత మన జగనన్న సంక్షేమ పాలనపై వ్యత్యాసంను వివరిస్తూ జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, వైయస్ జగన్‌కు మద్దతుగా 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, వారితో సెల్ఫీలు దిగుతున్నారు. రోజూ లక్షలాదిమంది మిస్ట్ కాల్స్ ఇస్తున్నారు.
ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఐఏఎస్ అధికారిలాగా నటించి ఒక మహిళను మోసగించినందుకు 61 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వీవీఐపీ కోటాలో రాజర్‌హత్ మెగాసిటీలో రెండు ప్రభుత్వ ఫ్లాట్‌లను కేటాయిస్తామని, విదేశీ మద్యం లైసెన్స్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ శాంతో కుమార్ మిత్రా అనే నిందితుడు ఓ మహిళ, ఆమె కుమార్తె నుంచి రూ.11.80 లక్షలు లాగేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో మంజు ఘోష్ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తాను తన కుమార్తెతో కలిసి ‘నకిలీ’ ఐఏఎస్ అధికారికి రూ.11.76 లక్షలు చెల్లించామని, అయితే అతను ఎలాంటి హామీలను నెరవేర్చలేదని లేదా మొత్తం మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడాది కాలంగా తలదాచుకున్న బర్తాలాలోని ఓ హోటల్‌లో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని హోటల్ గదిలో కొన్ని నేరారోపణ పత్రాలు లభించాయని పోలీసులు తెలిపారు. హోటల్ ముందు పార్క్ చేసిన అతని ఐ20 కారుపై పలు ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి నిజానికి బెలేఘాటా నివాసి అయితే కొన్నిసార్లు హరిదేవ్‌పూర్ ప్రాంతంలో కూడా ఉండేవాడని పోలీసులు తెలిపారు.
బలహీనవర్గాలకు అండ టీడీపీయే
ఏపీలో బలహీనవర్గాలకు ముందునుంచీ అండదండలు ఇచ్చింది టీడీపీయే అన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రతి ఒక్కరు నడుంబిగిద్దాం.. మన హక్కులను కాపాడుకుందాం..తెలుగుదేశం 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది..బలహీన వర్గాలకు వివిధ పధకాలు టిడిపి హయాంలోనే తీసుకువచ్చాం.ఆంద్రప్రదేశ్ లో ఇంకా కొన్ని కులాలు వెనుకబడే ఉన్నాయి..దేశ… రాష్ట్ర జనాభాలో అత్యధికులు బి.సి.లే..అయితే మనలో ఐకమత్యం లేదు. అందుకే ఎదగలేకపోతున్నాం..రాజకీయ పార్టీలు వేరైనా మనుషులు వేరైనా..అందరూ కలిసికట్టుగా ఉండాలి..తెలుగుదేశం పార్టీ అధికారం..లో ప్రతిపక్షంలో ఉన్నా ఐకమత్యంతో ఉంది..ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుది ఒకే నినాదం బలహీన వర్గాలు ఎదగాలన్నారు. ఈరోజుకి మనం కులవృత్తుల మీదనే బతుకుతున్నాం..జగన్ మోహన్ రెడ్డికి బలహీన వర్గాలంటే కోపం..ఎందుకంటే బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉంటారనీ..నాలుగు సంవత్సరాలలో 54 కార్పోరేషన్లు ఇచ్చారంటారు..ఒక్కపైసా కూడ నిధులివ్వలేదు..ఈ ప్రభుత్వంపై బలహీన వర్గాల తరపున మాట్లాడితే మా మీద కేసులు, అరెస్టులు..బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశం ఇచ్చేందుకు కృషిచేస్తాం..మీ అందరి సలహాలు తీసుకుని మ్యానిఫేస్టోలో పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు.
మనిషితో దోస్తీ చేసిన కొంగ
మనుషులు కొంచెం ప్రేమని చూపిస్తే.. చాలు పశువులు,పక్షులు కూడా మంచి స్నేహితులు అవుతాయి. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు నిలిచాయి. ఇటీవల ఆరిఫ్ కాన్ గుర్జార్, సరస్ క్రేన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన ఫ్రెండ్ షిప్ చేిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మౌలోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరైపర్ మాలిక్ గ్రామంలో నివాసించే రామ్ సముజ్ యాదవ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఆకలితో ఉన్న పక్షికి ఆహారం ఇవ్వడంతో ఈ స్టోరీ ప్రారంభమైంది. మొదట సరస్ క్రేన్ కు రెండు సార్లు ఆహారాన్ని రామ్ సముజ్ యాదవ్ ఇచ్చాడు. దీంతో ఆ పక్షి పదే పదే ఆహారం కోసం రావడం ప్రారంభించింది. అనంతరం రామ్ తోనే కలిసి సరస్ కొంగ జీవించడం ప్రారంభించింది. త్వరలోనే ఆ బంధం మరింత బలపడింది అని రామ్ సముజ్ యాదవ్ చెప్పుకొచ్చాడు.రామ్ సరస్ క్రేన్ తో ఆడుకుంటాడు. తన చేతులతో స్వయంగా ఆ కొంగకు ఆహారం తినించాడు.. అయితే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సరస్ క్రేన్.. రామ్ సముజ్ యాదవ్ మధ్య హృదయాన్ని కదిలించే ఫ్రెండ్ షిప్ ఉంది అనే క్యాప్సన్ తో ఓ ప్రముఖ వార్త సంస్థ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బీజేపీ యువనేత దారుణ హత్య… అదుపులోకి నిందితులు
కర్ణాటకలో బీజేపీ యూత్ వింగ్ నాయకుడు ప్రవీణ్ కమ్మార్ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ధార్వాడ్ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయితీలో ఓ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమాం కొనసాగుతుండగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణను ఆపేందుకు ప్రవీణ్ ప్రయత్నించగా.. ప్రత్యర్థి వర్గం అతడ్ని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్ర గాయాలపాలవ్వడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వారు తాగిన మత్తులో ఉన్నారని.. మొత్తం నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి వర్గం కుట్రపన్ని.. ఈ దారుణ హత్యకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ‘‘తీవ్ర వేదనతో ప్రవీణ్ కమ్మార్ హత్యకు గురయ్యారనే వార్త మీతో పంచుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ప్రవీణ్‌ను మంగళవారం రాత్రి దారుణంగా హతమార్చారు.
రొమాన్స్ విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య
భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ మద్యం సేవించడం వల్ల ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయంటే నమ్మక తప్పదు. ఆల్కహాల్ సేవనం తర్వాత ఇంటికొచ్చి కుటుంబీకులతో గొడవ పడిన ఘటనల గురించి వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు వ్యక్తిగత దాడుల వరకు వెళ్లాయి. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. శారీరక సాన్నిహిత్యం విషయంలో భర్తతో గొడవపడి ఓ మహిళ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త బావిలోకి దూకాడు. బావిలో దూకిన భార్యను కాపాడాడు. కానీ కాపాడిన కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ఆ భర్తే చంపేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శంకర్‌రామ్, అతని భార్య ఆశాబాయి ఇద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించి పడుకున్నారు. దీంతో శంకర్ తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను కోరాడు. శంకర్‌తో శృంగారానికి ఆశా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శారీరక సాన్నిహిత్యానికి సంబంధించిన గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే, ఆశా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యను కాపాడేందుకు శంకర్ కూడా బావిలోకి దూకాడు. కాసేపటి తర్వాత ఆశాను కాపాడి బావిలో నుంచి బయటకు తీశాడు.
జగన్ పై రాజకీయకుట్ర జరుగుతోంది
ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదిరిపోతోంది. సీఎం జగన్ పై దారుణమైన రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ కుట్ర చేస్తున్నారు. జగన్ వ్యక్తిత్వం తక్కువ చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని సుధాకర్ బాబు అన్నారు. ముద్దాయి దస్తగిరి బయటకి వచ్చి హత్య చేసిన విధానం చెప్పడం ఏంటి..?గొడ్డలితో నరికానని చెప్తుంటే సునీత ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..?సునీత భర్త కు ఈ హత్యలో సంబంధం ఉంది.. ఆ యాంగిల్ లో విచారణ జరపాలి.మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చంద్రబాబు తొలి ముద్దాయి.తొలి ముద్దాయిగా చంద్రబాబును చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు నెలలు విచారణ చేశారు.అప్పుడెందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి పేర్లు రాలేదు..?బాధితుల్ని ముద్దయిలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రానికి కావాల్సిన నిధుల సేకరణ కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళడం సాధారణం. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు సుధాకర్ బాబు.
ఏరుదాటాకా తెప్పతగలేస్తున్నావా తాప్పీ…
ఏరు దాటాకా తెప్ప తగలేసినట్టు అని తెలుగులో ఒక సామెత అందరికి తెలిసే ఉంటుంది. సక్సెస్ అందుకున్నాకా.. ఆ సక్సెస్ కు కారణం అయినవారిని మరిచి తమను తాము పొగుడుకున్నవారి గురించి మాట్లాడే సమయంలో ఈ సామెతను వాడుతారు. ప్రస్తుతం నటి తాప్సీ కి అయితే ఈ సామెత బాగా సూట్ అవుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ చేసిన వ్యాఖ్యలే. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే కథల సెలక్షనో, లేక అమ్మడి దురదృష్టమో తెలియదు కానీ.. స్టార్ హీరోల పక్కన నటించినా కూడా విజయాలు అందలేదు. కానీ, సౌత్ హీరోయిన్ గా మాత్రం తాప్సీ మంచి అవకాశాలనే అందుకుంది. ఇక టాలీవుడ్ లో దక్కని అదృష్టం.. బాలీవుడ్ దక్కుతుందేమో అని అక్కడ అడుగుపెట్టింది. కథలను మంచిగా ఎంచుకొని సౌత్ హీరోయిన్ కాస్తా లక్ కలిసొచ్చి బాలీవుడ్ హీరోయిన్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్లింది. ఇక్కడవరకు బాగానే ఉంది. అయితే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మొదట మనం నిలబెట్టిన ప్లేస్ ను మాత్రం మర్చిపోకూడదు.