Pottel Teaser Looks Promising: అనన్య నాగళ్ళ ఎంచుకునే కథాంశాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు పద్ధతి అయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ మాత్రం షాక్ కలిగిస్తున్నాయి. అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. గతంలో నందుతో సవారి లాంటి సినిమా చేసిన సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సాంగ్స్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి ఆకర్షించిన ఈ సినిమా టీజర్ ని ఈరోజు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వల్ల లాంచ్ చేశాడు. ఇక ఈ టీజర్ మాత్రం రా అండ్ రస్టిక్ కంటెంట్తో అలరిస్తోంది.
Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ను చుట్టేసి అయోధ్య రామయ్య దగ్గరకు హరీష్ అండ్ కో
ఒక పల్లెటూరులో జరిగే కథలాగా అనిపిస్తోంది. ఒక పేద కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఒక ధనిక వ్యక్తి కథగా ఇది అనిపిస్తోంది. ఇక సినిమాలో పొట్టేలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాకి పొట్టేలు అనే టైటిల్ పెట్టినట్టు టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ నేపథ్యంలో సాగబోతున్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో రా అండ్ రస్టిక్ మూవీగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ టీజర్ లాంచ్ చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఇలాంటివి సాధారణంగా మలయాళ సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, కానీ తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఇలాంటివి చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తే మరిన్ని సినిమాలు వస్తాయని ఆయన అన్నారు.. .