Tiger Nageswara Rao: మాస మహారాజా రవితేజ .. ఏదైనా ఒక పాత్రలో కనిపించాడు అంటే.. అందులో ఎలాంటి రిమార్క్ లు ఉండవు. రవితేజ ఎంచుకొనే కథలు కొన్ని తప్పు అయ్యి ఉండొచ్చు. కానీ, ఆయన నటనలో మాత్రం ఎలాంటి తప్పు జరగదు. పాత్ర ఏదైనా మాస్ మహారాజా దిగనంత వరకే. హిట్లు, ప్లాపులు అనేది పక్కన పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న రవితేజ రావణుసురతో ప్లాప్ ను అందుకున్నాడు. ప్రస్తుతం స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తుండగా.. పవన్ మాజే భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Singer Mangli : హద్దులు చెరిపేస్తున్న సింగర్ మంగ్లీ… షర్ట్ ముడేసి గుండెలు పిండేస్తోంది!
“నేటీ ముఖ్యంశాలు.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఇంకా అనేక నగరాల్లో అతి దారుణంగా దోపిడీలు చేసిన స్టూవర్టుపురం దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు” అనే టీవీ యాంకర్ వాయిస్ తో టీజర్ మొదలైంది. టైగర్ నాగేశ్వరరావు గురించి ఐబీ ఆఫీసర్ తో పాటు క్రైమ్ బ్రాంచ్ మొత్తం అతని కోసం వెతుకుంటున్నట్లు చూపించారు. అస్సలు టైగర్ నాగేశ్వరావు గురించి చెప్పాలంటే.. “నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఒక ఎలక్షన్ గెలిచేవాడు..స్పోర్ట్స్ లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియా కి మెడల్ గెలిచేవాడు.. ఆర్మీ లోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు.. అనుకోకుండా వాడొక క్రిమినల్ అయ్యాడు అని మురళి శర్మ చెప్పడం.. వెంటనే రవితేజ ఫేస్ ను రివీల్ చేయడం జరిగాయి. డైరెక్టర్ .. రవితేజకు ఎలివేషన్ ఓ రేంజ్ లో ఇచ్చినట్లు టీజర్ లోనే కనిపించేస్తోంది. ఇక నాగేశ్వరరావు సాహసాలు గురించి విని ఐబీ ఆఫీసర్ షాక్ అవ్వడంతో అతని కథ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆసక్తిని అభిమానుల్లో వచ్చేలా డైరెక్టర్ టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది.
Mahesh Babu: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం..
పులి, సింహం లాంటి జంతువులు కూడా ఒక వయస్సు వచ్చేవరకు పాలే తాగుతాయి సర్.. కానీ, వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు అని చెప్పిన డైలాగ్స్.. నాగేశ్వరరావు ఎంతటి క్రూరుడో చెప్పకనే చెప్పారు. అసలు అతను ఈ దోపిడీలు చేయడం వెనుక కథ ఏంటి.. ? చివరికి అతను ఏమయ్యాడు .. ? అనేది ఈ సినిమాలో చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్. ముందుగానే ఈ సినిమా మొత్తం రూమర్స్ నుంచి తీసుకున్న కథ అని చెప్పడంతో లాజిక్స్ కు పెద్ద పని లేదని తెలుస్తోంది. టీజర్ మొత్తంరవితేజను ఎలివేట్ చేయడమే తప్ప మిగతా పాత్రలను ఏవి చూపించలేదు. ఇక జీవీ ప్రకాష్ ఇచ్చిన సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.