ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ ఇంట్లో దొంగలు పడ్డారు. శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో చోరీ జరిగింది. దొంగతనం జరిగిన సమయంలో మేరీ కోమ్ ఇంట్లో లేరు. ఓ మారథాన్ ఈవెంట్‌లో పాల్గొనడానికి మేఘాలయలోని సోహ్రాకు వెళ్లారు. మేరీ కోమ్ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుల వివరాలు, డబ్బు నష్టం డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: IND vs PAK Final: పన్నెండింటిలో నాలుగే..…
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
యూట్యూబర్ బాక్సర్‌గా మారిన 27 ఏళ్ల జేక్ పాల్ ప్రముఖ బాక్సర్‌లలో ఒకరైన 58 ఏళ్ల మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను ఓడించాడు. డల్లాస్ కౌబాయ్స్ హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 27 ఏళ్ల జేక్ పాల్ కీలక మ్యాచ్‌లో టైసన్‌ను ఓడించాడు ఏకగ్రీవ నిర్ణయంతో జేక్ పాల్ గెలిచాడు.
భారత బాక్సర్ ప్రీతీ పవార్ వియత్నాంకు చెందిన వో థి కిమ్ అన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ మహిళల 54 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 5-0తో గెలిచి బాక్సింగ్‌లో భారత్ ప్రచారానికి శుభారంభం ఇచ్చింది.
ఒలంపిక్స్ 2024 పారిస్ నగరంగా జరగబోతున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ నుండి పురుషుల బాక్సింగ్ అర్హత పోటీల్లో భారతదేశానికి చెందిన నిశాంత్ దేవ్ స్థానాన్ని కన్ఫామ్ చేసుకున్నాడు. భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ అర్హత పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మక పారిస్ ఒలంపిక్స్ బెడుతును కైవసం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలంపిక్స్ 2024 బాక్సింగ్ నుండి పురుషులలో మొదటి ఎంట్రీ నమోదయింది. Road Accident…
ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండో పసిడి సాధించాలనే భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆశలు ఆవిరయ్యాయి. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల కోసం భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్ తొలి రౌండ్‌లో కాలు గాయానికి గురైన మేరీకోమ్.. బౌట్ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్‌వెల్త్ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల…
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఇవాళ హదరాబాద్ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది. దీంతో తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకనున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో నిఖత్ జరిన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్…
అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2028 ఒలంపిక్స్‌లో తమ అభిమాన ఆట జెంటిల్మెన్ గేమ్‌గా ప్రసిద్ధి పొందిన క్రికెట్‌కు ఈ సారి కూడ నిరాశే ఎదురయింది. ఒలంపిక్స్‌లోక్రికెట్ చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. గతంలో 10 ఓవర్ల క్రికెట్‌కు ఒలంపిక్ సంఘంతో పాటు బీసీసీఐ కూడా అంగీకరించింది. కానీ తాజాగా 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఉంటుందని అనుకున్నారు. ఒలంపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో క్రికెట్‌తోసహా…
ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ కేటగిరి లవ్లీనా బొర్గొహెయిన్ కాంస్యపతకం సాధించింది. సెమీస్‌లో లవ్లీనా టర్కీకి చెందిన ప్రపంచ చాంపియన్ సుర్మెనెలి చేతిలో ఓటమిపాలైంది. మొత్తం 5 రౌండ్లలోకూడా సుర్మెనెలి ఆదిపత్యం కొనసాగించింది. దీంతో సుర్మెనెలి లవ్లీనాపై 5-0 తేడాతో విజయం సాధించింది. ఎలాగైన ప్రపంచ బాక్సర్‌పై విజయం సాధించి స్వర్ణం గెలవాలని చూసిన లవ్లీనాకు సెమీస్‌లో ఎదురుదెబ్బ తగలడంతో కాస్యంతో సరిపెట్టుకోవాలసి వచ్చింది. ఇప్పటికే ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజతం,…