New Courier Scam Alert: ఇప్పుడు సైబర్ దొంగలు జనాన్ని మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అదే కొరియర్ స్కామ్. ఇప్పటి వరకు దేశంలో చాలా మంది కొరియర్ స్కామ్‌ల బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే రేపు మీరే కొరియర్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ లో టార్గెట్ అవచ్చు. అయితే కొరియర్ స్కామ్ అంటే ఏమిటి? దానిని నివారించడానికి మార్గం ఏమిటి? అనేది తెలుసుకుందాం పదండి
ప్రస్తుతం భారతదేశంలో కొత్త తరహా స్కామ్ జరుగుతోంది అదే కొరియర్ స్కామ్. మన భారతదేశంలో మోసానికి సంబంధించిన ఏదైనా పద్ధతి వెలుగులోకి వచ్చిన వెంటనే, కేటుగాళ్ళు వెంటనే ఇతర పద్ధతులను కనుగొంటారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు అదే కొరియర్ స్కామ్. ఇప్పటి వరకు మన దేశంలో చాలా మంది కొరియర్ స్కామ్‌ల బారిన పడి లక్షల రూపాయలు మోసపోయారు. ఇటీవల కొరియర్ స్కామ్ ద్వారా పీహెచ్‌డీ విద్యార్థిని బలి అయింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన ఒక చీటింగ్ విషయంలో ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ కంపెనీ ఫెడెక్స్ పేరుతో సైబర్ దుండగులు అతని నుంచి రూ.1,34,650 మోసం చేశారు.
Rakesh Master: రాకేష్ మాస్టర్ పేరిట జాతీయ పురస్కారం
నిషేధిత వస్తువులతో అతని పేరు మీద కొరియర్ వచ్చిందని దుండగులు విద్యార్థికి ఫోన్ చేశారు. ఆ విద్యార్థిని మరో కాల్ మరో దుండగుడు వీడియో కాల్ చేసి తాను ముంబై నార్కోటిక్స్ విభాగానికి చెందిన అధికారినని చెప్పాడు. స్కైప్ కాల్ ద్వారా విద్యార్థి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసి వెరిఫికేషన్ కోసం విద్యార్థి బ్యాంక్ ఖాతా సమాచారం కూడా కోరారు. అతనికి ఎండీఎంఏ (డ్రగ్స్) సరఫరాలో ప్రమేయం ఉందని ఆరోపించడమే కాదు ఈ కేసులో నిర్దోషిగా బయటపడేందుకు బాధితుడి నుంచి రూ.1,34,650 లూటీ చేసి అతని చేతే మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. ఇక గతంలో ఇదే తరహాలో ముంబైకి చెందిన ఓ మహిళ రూ.1.97 లక్షలు మోసపోయింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇదే పార్శిల్ స్కామ్ కింద 4.47 కోట్లు మోసపోయాడు.
కొరియర్ స్కామ్ అంటే ఏమిటి?
కొరియర్ స్కామ్ అనేది ఒక కొత్త తరహా మోసం. ఈ స్కామ్‌లో సైబర్ దుండగులు కస్టమ్స్ అధికారులుగానో, కొరియర్ కంపెనీ అధికారులుగానో నటిస్తూ ప్రజలకి ఫోన్లు చేసి డ్రగ్స్ లేదా కస్టమ్స్ పేరుతో భయపెడతారు. వారు ప్రజలకు ఫోన్ చేసి నిషేదిత సరుకులతో కూడిన పార్శిల్ వచ్చిందని భయపెట్టి స్కైప్ కాల్స్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా సమాచారం తీసుకుని వెరిఫికేషన్ పేరుతో మోసం చేస్తారు.
ఈ కొరియర్ స్కామ్ ఎలా నివారించాలి?
అసలు మీరు ఏ కొరియర్ ఆర్డర్ చేయకపోతే, మీకు కొరియర్ కాల్స్ ఎందుకు వస్తాయి? ఒకవేళ వస్తే కనుక అలాంటి కాల్స్ కు సమాధానం ఇవ్వవద్దు. ఎవరైనా పదే పదే ఇబ్బంది పెడితే ఆ నంబర్ బ్లాక్ చేసి సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. కస్టమ్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే అతనితో మాట్లాడకండి, బ్యాంక్ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. ఎవరైనా మీకు వెబ్ లింక్ పంపితే, దానిపై క్లిక్ చేయకండి. అటువంటి స్కామ్‌లను 155260కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inలో ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయండి.