మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన సినిమా వాల్తేర్ వీరయ్య. 2023సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న మెగాస్టార్ కు ఆ సినిమా బ్రేక్ వేసి సక్సెస్ ఇచ్చింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ కీలక పాత్రలో కనిపించాగా దర్శకుడు బాబీ ఇద్దరు హీరోలను చక్కగా హ్యాండిల్ చేసాడు అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Also Read : Ajith Kumar : ‘విడాముయార్చి’ అడ్వాన్స్ బుకింగ్స్ అవుట్ స్టాండింగ్
కాగా మరోసారి మెగాస్టార్ , బాబీ కాంబో రిపీట్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అలాగే యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించారు చిరు. ఈ సినిమాను యంగ్ హీరో నాని నిర్మిచనున్నారు. ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులు అనిల్ రావిపూడి తోను ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు మెగాస్టర్. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా తనకు ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ అదే జోష్ లో మెగాస్టార్ తో సినిమా కోసం కథ విషయమై పరిశోధన చేస్తున్నాడు. అన్ని కుదిరితే ఈ ఏడాది లోనే బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు అవుతుందని తెలుస్తోంది.