National Award in the name of Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈనెల 18న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన దశ దిన కర్మను నిర్వహించారు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తమ సొంత ఖర్చులతో ఈ పెద్ద కర్మను జరిపి సంతాప సభ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. సినీ రంగానికి చెందిన వెయ్యి మందికి పైగా ఈ పెద్ద కర్మలో పాల్గొని మటన్, చికెన్లతో ఏర్పాటు చేసిన విందు ఆరగించి వెళ్లారు. సంతాప సభ, పెద్ద కర్మలో రాకేష్ మాస్టర్ భార్య, ఇద్దరు పిల్లలు కూడా పాల్గొనగా సినీ పరిశ్రమ నుంచి దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హాజరయ్యారు. రామ్, ఇలియానాను హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి రూపొందించిన ‘దేవదాసు’ సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక రాకేశ్ మాస్టర్ ను ఎల్లకాలం గుర్తుంచుకునేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన శిష్యులు.
Balakrishna: దటీజ్ బాలయ్య.. జగపతిబాబు కోసం వెంటనే ఒప్పేసుకున్నాడట!
అదేమంటే రాకేష్ మాస్టర్ పేరిట జాతీయ పురస్కారాన్ని నెలకొల్పనున్నారు. ఆయన శిష్యులు సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ లు ఈ జాతీయ పురస్కారాన్ని ఏటా అందించడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ ప్రకటించారు. రాకేష్ మాస్టర్ సంతాప సభలో నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్‌ను సంస్మరించుకోవడానికి, స్మరించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని నాకు అనిపించింది, తెలుగువారి గుండెల్లోనే కాకుండా భారతీయుల గుండెల్లో రాకేష్ మాస్టర్ ఎప్పటికీ ఉండిపోయే విధంగా ఏదో ఒకటి చేయాలని ఆయన అన్నారు. అందులో భాగంగా రాకేష్ మాస్టర్ పేరు మీద ఒక జాతీయ అవార్డు నెలకొల్పాలి అని, ఆ మహానుభావుడి పేరు మీద జాతీయ పురస్కారం ప్రతి సంవత్సరం అందజేస్తారని ప్రకటిస్తున్నామని వెల్లడించారు.