‘డ్యాన్స్ ఐకాన్’ షో సీజన్ 1 ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. ఇక దీనికి కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్’ ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లు గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్ లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో షో గురించి ప్రెస్ మీట్ ను ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు.
ఇందులో భాగంగా హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ 1’ షో ను మీరు ఎంతో సక్సెస్ చేశారు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు. సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. షోలో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. ఇక ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. నేను సినిమాకు వర్క్ చేశాను. టీవీకీ వర్క్ చేశాను. ఏ ప్లేస్ లో వర్క్ చేసినా ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉండేలా చూసుకుంటా’ అని తెలిపారు ఓంకార్.
ఇక ఓంకార్ తో పాటుగా ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ , యష్ మాస్టర్,మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి,మెంటార్ ప్రకృతి కూడా మాట్లాడుతూ ఈ షో గురించి పలు విషయాలను పంచుకున్నారు.