సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) బిజినెస్ హెడ్-సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, Sony SAB, PAL, మరియు Sony MAX మూవీ క్లస్టర్లలో ఉన్న నీరజ్ వ్యాస్.. ఈ నెలఖారులో కంపెనీ నుండి వైదొలగనున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్ తర్వాత.. వ్యాస్ కొత్త వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. డిస్నీ స్టార్ నెట్వర్క్ నుంచి వచ్చిన గౌరవ్ బెనర్జీ ఈ నెలాఖరులో సోనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నాడు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.’ మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తర్వాత.. నీరజ్ వ్యాస్ ఇప్పుడు తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.’ అని తెలిపింది. సోనీ యొక్క మూడు ఛానెల్‌లు.. హిందీ మూవీ ఛానెల్‌ల వ్యాపారాన్ని మెరుగుపరచడంలో నీరజ్ తన పదవీ కాలంలో ముఖ్యమైన పాత్ర పోషించారని కంపెనీ పేర్కొంది.
Kumaradevam Movies Tree : 300 సినిమాల్లో కనిపించిన చెట్టు ఇక లేదు
నీరజ్.. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ సేల్స్ టీమ్‌తో సోనీలో తన వృత్తిని ప్రారంభించాడు. 2005లో అతను ఛానెల్ నేషనల్ సేల్స్ హెడ్ గా నియమితలయ్యాడు. ఐదేళ్లలో అతను సోనీ మిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా మారడంలో విజయం సాధించాడు. 2011లో సోనీ మ్యాక్స్ బాధ్యతలు స్వీకరించి.. 2017లో సోనీ ఎస్‌ఏబీ, సోనీ పాల్ల కమాండ్ని కూడా పొందారు. గత సంవత్సరం.. సోనీ, జీ నెట్వర్క్ మధ్య ప్రారంభమైన విలీన చర్చల మధ్య.. అతను సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కమాండ్ కూడా పొందాడు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా.. పెద్ద పునర్వ్యవస్థీకరణలో ఇటీవలే డిస్నీ స్టార్ చీఫ్ గౌరవ్ బెనర్జీని కంపెనీ సీఈఓగా నియమించారు. అతను ఈ నెలాఖరులో బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.
Suicide: ఆ వ్యాధితో బాధ పడుతూ.. భరించలేక గన్‌తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
నీరజ్ వ్యాస్ తన వీడ్కోలు సందేశంలో.. “సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో నా ప్రయాణం ఎదుగుదల, కొత్త అభ్యాసాలు మరియు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా పదవీ కాలంలో కంపెనీ నాపై ఉంచిన నమ్మకానికి.. ఈ కాలంలో నాకు లభించిన అవకాశాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నేను ఇప్పుడు నా కొత్త వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ సంవత్సరాల్లో నేర్చుకున్న అన్ని విషయాలు నాకు అనుభవంగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను”. అని తెలిపాడు.