Viral Video: ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో బతికేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయయోక్తి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజుల్లో యువత చాలా రీల్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో కొన్ని రీల్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘తౌబా-తౌబా’ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో వ్యూస్‌ని పొందేందుకు ప్రత్యేకంగా డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను అనుసరించి ఓ అమ్మాయి రోడ్డుపై రీలు వేస్తుంటే అటుగా వెళ్తున్న వాళ్ల కళ్లు అప్పగించి చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈవిడ సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
MLC Kavitha: తీహార్ జైలులో వున్న కవిత కోసం ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..
వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మైంత్రా ఫ్యాషన్ సూపర్ స్టార్., అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ తనుమితా ఘోష్. ఇన్‌స్టాగ్రామ్‌లో కొనసాగుతున్న ‘తౌబా-తౌబా’ ట్రెండ్‌పై రీల్ చేయడానికి ఆమె ముంబై వీధుల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె టవల్ లో మాత్రమే ఉంది. ఆమె శరీరంలో సగానికి పింక్ కలర్ టవల్ చుట్టి, మరో టవల్ తో తలపై తడి జుట్టు కట్టుకుంది. ఆమెను చూస్తుంటే.. తనుమితా ఘోష్ బాత్‌రూమ్ నుంచి నేరుగా రోడ్డుపై వీడియో తీయడానికి వచ్చినట్లు అనిపించింది. అయితే., రోడ్డుపై వెళ్తున్న వారికి తనుమిత ఘోష్ తెలియక పోవడంతో పాటు మొత్తం విషయం తెలియకపోవడంతో రోడ్డుపై వెళ్తున్న జనం ఆ అమ్మాయిని చూసి బిత్తరపోయారు. తనుమిత టౌబా టౌబా ట్రెండ్‌లో వీడియో రీల్స్ చేస్తూనే ఉంది. ఇక, తనుమిత మార్గమధ్యంలో తలపై, సగం శరీరంపై వేసుకున్న టవల్‌ను తీసేసింది. మొదట టవల్ మాత్రమే వేసుకున్నట్లు అనిపించినా టవల్ విప్పగానే లోపల డ్రెస్ వేసుకుని తనుమిత చేసిన ఈ బోల్డ్ స్టంట్ కి జనాలు ఫిదా అయిపోయారు.
Lovers On Bike: ఛీ.. ఛీ.. పట్టపగలు ప్రేమికులు నడిరోడ్డుపై బరితెగించారుగా..
ఇక ఈ వీడియో తర్వాత తనుమితా ఘోష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో రీల్ వీడియోను కూడా షేర్ చేసింది. ఈ రోజు నన్ను చూసిన తర్వాత ముంబై ప్రజలు తప్పనిసరిగా ‘తౌబా-తౌబా’ అనుభూతి చెందుతున్నారని వీడియో క్యాప్షన్ ను జత చేసింది. ఘోష్ కి సంబంధించిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది. ఈ వీడియోను 10 లక్షలకు పైగా వీక్షించారు. వేలల్లో లైక్స్, షేర్లు వస్తున్నాయి. ప్రజలు ఈ వీడియోపై వారి వారి అభిప్రాయాల ప్రకారం చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో ఉద్దేశంపై తనుమిత కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో 2019లో ఒక షో నుండి వచ్చినదని, అక్కడ తనకు ప్రత్యేక టాస్క్ ఇవ్వబడిందని చెప్పింది. ఇది సీరియస్‌గా తీసుకోకూడదని, కేవలం వినోదంలో భాగంగా మాత్రమే చూడాలని తెలిపింది.