Lovers On Bike Viral Video: ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక పనులు చేస్తూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు వారు చేసే పనులవల్ల చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. ఇకపోతే కొంతమంది యువత వారి చుట్టుపక్కల వారు ఎంతమంది ఉన్నా అవి తనకు ఏమి పట్టవు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. నడి రోడ్డుపై పబ్లిక్ వాహనాలలో ఇలా ఎక్కడపడితే అక్కడ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టు లోకి మరో వీడియో చేరింది. ఇద్దరు ప్రేమికులు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒకరికి ఒకరు లిప్ టు లిప్ ముద్దు చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని వెనుకల ఇద్దరు ప్రేమికులు కూర్చొని ఉన్నారు. బైక్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యక్తి వెనకాల ఉన్న ఇద్దరు ప్రేమికులు రెచ్చిపోయారు. ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటూ రోడ్డుపైనే వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. వీడియోని కాస్త.. వారు అంతటితో ఆగకుండా., సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. దింతో ఇంకేముంది ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్న సమయంలో ఇదేం పాడుపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరైతే ఏం ఇంటికి కూడా వెళ్లెంతవరకు కూడా ఆగలేకపోయారా.? అంటూ కామెంట్ చేస్తున్నారు.
Wayanad Landslides : చిద్రమైన ముఖాలు.. పాదాలను చూసి అంచనా వేయాల్సిన దుస్థితి.. వయనాడ్ విషాదం