Dead Body In Plastic Bag: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు. అయితే ఓ రోజు 21 ఏళ్ల కూతురు తన తల్లిని చంపాలని ప్లాన్ వేసింది. అనుకున్నట్లుగానే హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ తన తల్లి మృతదేహాన్ని కుక్కింది. మృతురాలి సోదరుడు, మేనల్లుడు మంగళవారం కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో అదృశ్యమైన వ్యక్తుల ఫిర్యాదును నమోదు చేసినట్లు డీసీపీ ప్రవీణ్ ముండే తెలిపారు. మొదటి అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో వెతకగా, ప్లాస్టిక్ బ్యాగ్‌లో మహిళ కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది.
Read Also: Bandi Sanjay : ప్రశ్నిస్తే…. అరెస్ట్ చేస్తారా?.. అరెస్టులు, జైళ్లు మాకు కొత్త కాదు
ఒకరోజు కాదు వారం కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఆ బ్యాగులోనే తన తల్లి మృతదేహాన్ని ఉంచింది ఆ కూతురు. మంగళవారం రోజున ఆ మృతురాలి సోదరుడు, అల్లుడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తల్లికూతుర్లు ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్లి అక్కడ వెతికారు. ఇంతలోనే వాళ్లకి ఓ బ్యాగు కనిపించింది. విప్పి చూస్తే కూళ్లిపోయిన ఆ తల్లి మృతదేహం కనిపించింది. వెంటనే ఆ కూతుర్ని పోలీసులు అరెస్టు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రస్తుతం ఆ కూతుర్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆ కూతురు తన తల్లిని ఎందుకు చంపింది. ఆ తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లో కొన్ని నెలల పాటు ఎందుకు ఉంచిది.. అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Read Also: Funny : వారెవ్వా.. ఏం ఫీల్డింగ్ బాసూ.. క్రికెట్లో నిన్ను మించిన వారే లేరు పో
ఈ మధ్య కాలంలో జరుగుతున్న హత్యలు గమనిస్తే చాలా సంఘటనల్లో హత్య చేయబడ్డ వారి మృతదేహాలు నిందితుల ఇళ్లలోనే దొరుకుతున్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసులో, 28 ఏళ్ల ఆఫ్తాబ్ పూనావాలా తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె శరీర భాగాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, ఆపై వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మెహ్రౌలీ అడవిలో అక్కడక్కడ పడవేశాడు.