Degree Not Required for Jobs: తరుచూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పంచుకుంటారు. తాజాగా డిగ్రీ చదువుల గురించి 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ చేశారు.
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ…
Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో…
రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు.…
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు…
తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.
Nara Lokesh : పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (PTM)లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతూ మంత్రి నారా లోకేష్ లేఖ విడుదల చేశారు. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్,ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల…
సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే.. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్ వాడీలలో…
పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించి, నిర్మించిన 'యూనివర్సిటీ' చిత్రం ఈ నెల 26న విడుదల కాబోతోంది. దర్శకత్వంలో పాటు కథ, కథనం, మాటలు, సంగీతం ఆర్. నారాయణ మూర్తే సమకూర్చుకోవడం విశేషం.