Beerla Ilaiah: యాదాద్రి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే తనిఖీల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. రెగ్యులర్ ఇంజక్షన్ బాక్స్ లో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఇంజక్షన్ వుండటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజక్షన్ ను రెగ్యులర్ మెడిసిన్ బాక్స్ లో ఎందుకు ఉంచారని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజక్షన్ ఎందుకు ఉంచారని వైద్యులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ప్రాణాలు ఎలా కాపాడుతారు? అని మండిపడ్డారు.
ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులపై నమ్మకంతో రోగులు వస్తే.. ప్రాణాలు హరించే విధంగా వైద్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఆసుపత్రికి రావాలని సూచించారు. ప్రభుత్వ వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడే విధంగా వైద్యలు, సిబ్బంది వ్యవహరించాలని అన్నారు. డేట్ ముగిసిన ఇంజక్షన్, మందులు, ఏవైన సరే ఉపయోగించవద్దని హెచ్చరించారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను హెచ్చరించారు. అక్కడకు వచ్చిన రోగులను పలకరించారు. ఎలాంటి అనుమానం వచ్చిన అధికారులను సంప్రదించాలని కోరారు.
CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..