నేచరల్ స్టార్ నాని దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమాతో నాని మార్కెట్ కూడా బాగా పెరిగింది. దసరా సినిమా తరువాత హాయ్ నాన్న వంటి క్లాస్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. . ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇటీవలే వివేక్ ఆత్రేయతో రెండో సినిమాను చేస్తున్నట్లు నాని ప్రకటించాడు. దీనికి సంబంధించిన ముహూర్తపు వేడుక దసరా రోజున గ్రాండ్ గా జరగునుంది. ఇక గతేడాది వీళ్ల కాంబోలో వచ్చిన అంటే సుందరానికి అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే చాలా మందికి సినిమా చాలా బాగా నచ్చింది. కానీ కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయింది.ఇక ఇప్పుడు అదే కాంబోలో రెండో సినిమా తెరకెక్కనుండంటో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.
ప్రియాంక అరుళ్ మోహన్ మరియు ఎస్.జే సూర్య వంటి స్టార్ కాస్ట్ తోడవడంతో ఈ సారి ఈ కాంబోలో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రకటించారు. మలయాళ కంపోజర్ జేక్స్ బేజోయ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. తెలుగులో జేక్స్ టాక్సీవాలా, చావు కబురు చల్లగా, ఒకే ఒక జీవితం వంటి సినిమాలకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ స్వరాలు సమకూర్చాడు. తొలిసారి వివేక్ ఆత్రేయ కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్నాడు. వివేక్ తెరకెక్కించిన గత మూడు సినిమాలకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చాడు.ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాను నిర్మించిన డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయా ఈ సినిమాను యాక్షన్ జానర్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు వివేక్ నుంచి ఇలాంటి జోనర్లో సినిమా అస్సలు రాలేదు. క్లాస్ పేరున్న వివేక్ మాస్ కథను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడా అనే డౌట్ కూడా చాలా మంది మదిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సారి అయిన ఈ దర్శకుడు నానికి హిట్ ఇస్తాడో లేదో చూడాలి…