Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.. కాగా, అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. దీంతో,…
ఇటీవల కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన సౌబిన్ షాహీర్, అనుకోకుండా చిక్కుల్లో చిక్కుకున్నాడు. నిజానికి అతనే లీడ్‌గా, నిర్మాతగా మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు నమోదు అవ్వగా, అతన్ని కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు సినిమాకి సహనిర్మాతలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. Also Read:Samantha: సమంత పట్టుకున్న…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్, ముందస్తు బెయిల్ పిటిషన్లు రెండు ఒకేసారి నిందితులు దాఖలు చేయటం చర్చగా మారింది. 2 పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్.
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని విడుదల రజిని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ పై ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు విచారించింది. ఇందులో భాగంగా విడదల రజనీతో పాటు పిఏ రామకృష్ణకు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని…
వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఊరట దక్కింది.. వల్లభనేని వంశీ మోహన్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. ఇక, దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు.
సంచలనం సృష్టించిన ముంబై సినీనటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. ఈ కేసులో ఐపీఎస్ అధికారులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. కా
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది.. అయితే, ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. గత వారం విచారణ ముగించిన జిల్లా కోర్టు.. విచారణను వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న…
పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు..
ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్పై కేసు నమోదు అయ్యే ఛాన్స్‌తో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ…