కాంగ్రెస్ పార్టీకి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్ రాజీనామా చేశారు. మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది పైగా ముఖ్య కార్యకర్తలతో రహస్యభేటీ అయిన శ్రీధర్.. కాంగ్రెస్ పార్టీని తల్లిలా భావించా, కానీ ఆ తల్లే నన్ను మోసం చేసింది అని కంటతడి పెట్టుకున్నానని నందికంటి శ్రీధర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని 35 సంవత్సరాలు గా పని చేశానని నందికంటి శ్రీధర్ అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదని, 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగిందన్నారు.
Also Read : World Cup 2023: ప్రపంచ కప్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమింగ్ ఎందులో తెలుసా..!
రాహుల్ గాంధీ ఉదయపూర్ డిక్లరేషన్ లో ఒక్క ఇంటికి ఒక్కటే టికెట్ ఇస్తాం అని చెప్పారని, ఇప్పుడు మైనంపల్లి హనుమంత్ రావు కి మల్కాజగిరి సీట్, అయినా కొడుకుకి మెదక్ సీట్ ఎలా ఇస్తారో చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. నా రాజీనామా లేఖను అధిష్టానంకు పంపడం జరిగిందని, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి టికెట్ ఇస్తారా అని నందికంటి శ్రీధర్ మండిపడ్డారు. 1994 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న గుర్తింపు లేదని, ఈసారి టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బీసీలకు ప్రాధాన్యత దక్కడం లేదని, గత ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి లేదా పోటీ చేసిన బీసీ కమ్యూనిటీ నాయకులకు అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందన్నారు నందికంటి శ్రీధర్. మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల సీట్లను ఒకే కుటుంబానికి ఎలా కేటాయిస్తున్నారని, బీసీ నాయకులను కాదని మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ కి రెండు సీట్లు కేటాయించడం అన్యాయమన్నారు.
Also Read : World Cup 2023: ప్రపంచ కప్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమింగ్ ఎందులో తెలుసా..!
వీళ్లు ఇద్దరూ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదని, కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి, పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన మైనంపల్లికి టికెట్ కేటాయించాలని చూడడం దుర్మార్గమన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీ ఒక అగ్రకుల కుటుంబానికి సీటు కేటాయించాలని చూస్తున్నదని, పార్టీ మారిన ఈ ఇద్దరు వ్యక్తులకు సీట్లు ఇవ్వడం అన్యాయమన్నారు నందికంటి శ్రీధర్. దీంతో కాంగ్రెస్ పార్టీలో బీ సీట్లకు సీట్లు దక్కవని తేలిపోయిందని,
అందుకే కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు.