Gautam Theatre Performance in London: తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనిని చూస్తే చాలా గర్వంగా ఉందని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. గౌతమ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు. గౌతమ్ తాజాగా లండన్‌లో తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సంబంధించి కొన్ని ఫోటోలను నమ్రత ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గౌతమ్ తొలి ప్రదర్శన గురించి అభిమానులకు తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు.
‘గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. గౌతమ్ పెర్ఫార్మెన్స్ చూసిన అందరూ ఎంజాయ్ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ‘జాయ్ ఆఫ్ డ్రామా’ నిర్వహించే సమ్మర్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌కు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార సహా నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్ హాజరయ్యారు. ఇందుకు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: TG Vishwa Prasad: చిరంజీవిని చూస్తే చాలనుకున్నా.. కానీ పవన్ కల్యాణ్‌తో పని చేశా!
గౌతమ్ ఘట్టమనేని విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్ ఇప్పటికే బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘1 నేన్కొక్కడినే’లో గౌతమ్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసంటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సిద్ధమవుతున్నారు.