ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులకు పుష్ప సినిమా పిచ్చ పిచ్చ గా నచ్చేసింది.పుష్ప సినిమాలోని సాంగ్స్ మరియు డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాయి.పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పుష్ప విడుదల అయిన దాదాపు సంవత్సరానికి పుష్ప 2 ను మొదలెట్టారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శర వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ పుష్ప 2కి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ని ఇచ్చింది.
ఈ సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి అయిన భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన ఫాహద్ ఫాసిల్ లుక్ ను మేకర్స్ విడుదల చేసారు..ఈ రోజు ఫాహద్ బర్త్డే కావడంతో మేకర్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు.పుష్ప సినిమా క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఎంతగానో మెప్పించారు. పుష్ప సినిమా లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.పుష్ప 2 లో కూడా షెకావత్ పాత్ర కాస్త ఎక్కువ లెంగ్త్ తో ఉంటుందని సమాచారం.తాజాగా ఫాహద్ ఫాసిల్ పుష్ప 2 చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు.. షెకావత్ సర్ ప్రతీకారంతో మళ్ళీ తిరిగొస్తున్నారు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.పుష్ప 2 లో అల్లుఅర్జున్, ఫాహద్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. మరి ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.