నల్లకుంటలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యని అతి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఇంట్లో పిల్లల ముందే భార్యపై దాడి చేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని సైతం మంటల్లో తోసేసి పరారయ్యాడు. తల్లీకూతుళ్ల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందగా.. స్వల్ప గాయలతో కూతురు బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Phone Tapping Case: సిట్ విచారణ పూర్తి.. ఇంటికి వెళ్లిపోయిన ప్రభాకర్ రావు!
నల్గొండ జిల్లా హుజురాబాద్‌కి చెందిన వెంకటేష్, త్రివేణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త వెంకటేష్‌కు భార్యపై ఎప్పటినుంచో అనుమానం ఉంది. త్రివేణితో తరచూ గొడవ పడుతూ.. వేధింపులకు గురిచేశేవాడు. తాజాగా భర్త వెంకటేష్ వేధింపులు తాళలేక త్రివేణి అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి మారుతాను అంటూ త్రివేణిని హైదరాబాద్ తీసుకువచ్చాడు. హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజులకే దారుణంగా హత్య చేశాడు. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం పరారైన వెంకటేష్‌ను 12 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.