Group 1 Mains Result Release: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది.. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఈ రోజు గ్రూప్ ఫలితాలను విడుదల చేశారు.. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా గౌతం సవాంగ్ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తాం.. ఇప్పుడు 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం అని తెలిపారు. ఇక, గ్రూప్-1 పరీక్షల కోసం 1,26,449 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ప్రిలిమ్స్ ఫలితాలను రికార్డు స్థాయిలో 19 రోజుల్లో విడుదల చేశాం.. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించామని.. ఎంపికైన అభ్యర్ధులు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు చేశామని.. కేవలం 34 రోజులలో మెయిన్స్ ఫలితాలు విడుదల చేశామని తెలిపారు.
Read Also: Bus Catches Fire: వీళ్లు నిజంగా అదృష్టవంతులే.. లేకపోతే ప్రాణాలు పోయేవే
ఇక, మొదటి సారి సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలను నిర్వహించినట్టు వెల్లడించారు గౌతం సవాంగ్.. రికార్డు టైంలో 11 నెలల వ్యవధిలోనే ఎంపిక పూర్తి చేయగలిగాం.. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేశాం.. అంటే 220 మంది ఇంటర్వూకు ఎంపిక అయ్యారు.. 220లో 35 మంది అభ్యర్థులు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చిన వారే అన్నారు. మొదటి 10 మందిలో 6 గురు మహిళా అభ్యర్థులే ఎంపిక అయ్యారు.. ఎంపికైన వారిలో 52 శాతం మంది మహిళలే ఉండటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకొచ్చారు. ఇక, ఈ ఫలితాల్లో మొదటి ర్యాంక్ భానుశ్రీ అన్నపూర్ణ ప్రత్యూష, రెండో ర్యాంక్ భూమిరెడ్డి భవాని, మూడో ర్యాంక్ లక్ష్మీ ప్రసన్న సాధించారు. టాప్ మూడు ర్యాంకుల్లో అమ్మాయిలే సాధించడం విశేషం.