Telangana Heavy rain: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పయనించే ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో తెలంగాణలో సైతం నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే.. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం.. క్రమంగా బలపడుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం నేడు, రేపు (గురు, శుక్ర) రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Read also: Madhya Pradesh: మటన్ కోసం మొగుడు పెళ్లాల గొడవ.. మధ్యలోకి వెళ్లిన వ్యక్తి మర్డర్
నిన్న రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఓ లారీ వరద నీటిలో చిక్కుకుపోయింది…పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి సర్వీసు రోడ్డుపై వరద నీరు పోటెత్తింది… ఓ లారీ డ్రైవర్ అర్ధరాత్రి ఔటర్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తీసుకొని వాహనాన్ని ముందుకు దూకించాడు. దీంతో లారీ ఆ నీటిలో చిక్కుకుంది. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వెంటనే వారు 100 కు ఫోన్ చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, తాళ్లసాయంతో ముగ్గురినీ బయటకు లాగారు. ఇక..సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్. మండలం రామన్నగూడెం శివారులో పిడుగుపాటుకు మల్లయ్య అనే రైతు.. అతడి రెండు గేదెలు మృతిచెందాయి. వర్షాలకు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతోంది…జూరాలకు 1.48 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 1.64 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే… కృష్ణాలో ఎగువన ఆల్మట్టికి 20 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక..గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 77 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 99 వేల క్యూసెక్కులు, తుపాకులగూడెం బ్యారేజీకి 2.52 లక్షలు, దుమ్ముగూడెంలోకి 2.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
Corona: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్.. యమా డేంజరట!