రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర మంత్రి మునిగంటి సుధీర్ వార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునిగంటి సుధీర్ వార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమి లోని పార్టీల నాయకులు దేశ అభివృద్ధి కోసం కాకుండా వారి కుటుంబాల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. ఇండియా కూటమిలో కొత్తగా ఏమీ లేదు.. అంతకుముందు ఉన్న కూటమిలోని పాత పార్టీల నాయకులే కొత్త పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ సింహం లాంటి నాయకుడు.. అడవిలోని జంతువులన్నీ ఏకమైనా సింహానికి ఎదురు నిలువ లేవు అదేవిధంగా నరేంద్ర మోడీని ఢీకొనే దమ్ము ఇండియా కుటమి లోని నాయకులకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Koppula Eshwar : కేసీఆర్ హయాంలో తెలంగాణ ఒక బొమ్మరిల్లులా అయింది
ఒకప్పుడు ఈ నాయకులు ఇండియా అంటేనే ఇందిరా అని చెప్పుకున్నారు.. మహారాష్ట్రతో బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదు.. మహారాష్ట్రలో ఇప్పటివరకు ఒక సర్పంచ్ మాత్రమే ఆ పార్టీలో చేరారు. మహారాష్ట్రలో ఆ పార్టీ విస్తరణకు ఏమాత్రం అవకాశం లేదు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులకు మహారాష్ట్రలోని పరిస్థితులకు ఎలాంటి పొంతన ఉండదు. మహారాష్ట్రలో వివిధ పార్టీల్లో ఏమాత్రం గుర్తింపులేని ఆదరణ లేని నాయకులు మాత్రమే టిఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయం ఇప్పటివరకు ఎలాంటి చర్చకు రాలేదు.. రానున్న రోజుల్లో దేశ సమైక్యత, అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ఏ పార్టీతోనైనా పొత్తుకు అవకాశం ఉంటుంది.. ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ దేశ సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుంది.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు మా కుల దైవం. ప్రతి సంవత్సరం రాజన్నను దర్శించుకుని ఆశీస్సులు పొంది కొత్త ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయడం అలవాటుగా మారింది. వేములవాడ దేవస్థానం అభివృద్ధి ఆశించినంతగా జరగలేదు మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..