ముంబై నగరంలో విచిత్రమైన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. లోకల్ ట్రైన్ ను ముంబై లైఫ్ లైన్ అంటూంటారు. ట్రాఫిక్ జామ్ ను నివారించడానికి.. టైంకి తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముంబై నగరంలో ప్రతిరోజు లక్షలాది మంది లోకల్ రైళ్లో ప్రయాణిస్తున్నారు. అయితే.. పౌరుల ప్రయాణాన్ని మెరుగుపరచడానికి ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మంట్ అథారిటీ ఎనిమిదేళ్ల క్రితం ముంబయి మెట్రోని స్టార్ట్ చేసింది. దీంతో ప్రజలు రద్దీ లేకుండా తక్కువ టైంలో ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్ ల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించింది.
Also Read : IPL 2023: గుజరాత్ వర్సెస్ ముంబై ఢీ.. వాంఖడే వేదికగా హోరాహోరీగా పోరు
ప్రస్తుతం ముంబై మెట్రో రైలు కోచ్ కు సంబంధించిన ఒక ఫోట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ముంబై మెట్రో స్టేసన్ పేరు ఒక బోర్డుపై ఒక విధంగా.. మరో ప్రదేశంలో మరో విధంగా రాసి ఉండడం చూసి ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం మార్కెటింగ్ యుగం నడుస్తుంది. ఎటు చూసినా.. ఏం చేసినా బిజినెస్ తో ముడిపడి ఉంటుంది. అలాంటిదే ఈ సంఘటన కూడా.. ఈ వైరల్ అవుతున్నా ఫోటో. మెట్రో కోచ్ లో ఇన్ స్టాల్ చేయబడిన బోర్డు.. ఇందులో ఇతర మెట్రో స్టేషన్ ల పేరుతో కాకుండా.. వాటికి ఫేమస్ అయిన బ్రాండ్స్ పేర్లను జోడించారు. LIC అంధేరి, మెడిమిక్స్ ఆజాద్ నగర్, బిస్లేరి పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ హైవే అనే పేర్లతో స్టార్ట్ అయ్యాయి.
Also Read : Karnataka Elections: బీజేపీ, కుమారస్వామి మంతనాలు చేయనివ్వండి.. మాదే విజయమన్న డీకే శివకుమార్..
ఈ స్టేషన్లలో ఇఒకటి వచ్చినప్పుడు.. మెట్రో స్టేషన్ పేరును ప్రకటించడమే కాకుండా సంబంధిత బ్రాండ్ జింగిల్ ప్లే చేస్తుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోపై నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోను ఇప్పటి వరకు లక్ష కంటే ఎక్కువ మంది చూశారు.. సుమారు రెండున్నర వేల లైకులు కూడా వచ్చాయి.