Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో మోనోరైలు రైలు పరీక్షా సమయంలో ప్రమాదానికి గురైంది. మోనోరైలు పట్టాలు తప్పడంతో దాని ముందు భాగం గాల్లోనే నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ, పరీక్ష సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద విషాదం తప్పింది. మోనోరైలు రైలు పట్టాలు తప్పి ఒక నిర్మాణాన్ని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. MMRDA, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు..
ప్రస్తుతం ముంబై మెట్రో రైలు కోచ్ కు సంబంధించిన ఒక ఫోట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ముంబై మెట్రో స్టేసన్ పేరు ఒక బోర్డుపై ఒక విధంగా.. మరో ప్రదేశంలో మరో విధంగా రాసి ఉండడం చూసి ప్రయాణికులు షాక్ అవుతున్నారు.