MSD: థాయ్‌లాండ్‌లో ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి.. కూతురు ముందే..!
- తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎంఎస్ ధోనీ
- ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లిన ఎంఎస్‌డీ
- బీచ్‌లో తన కూతురు ముందు ఎంజాయ్ చేస్తున్న ధోనీ
- ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. తమ పిల్లలకు నచ్చే విధంగా మార్చుకుని పిల్లలను అలరిస్తుంటారు. పిల్లల సంతోషం కోసం ఏదీ చేయడానికైనా వెనుకాడరు పేరెంట్స్.. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ కూడా తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఫుటెక్‌లోని బీచ్‌లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..
Also Read
శనివారం జీవా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో బీచ్ ఫోటోలు, వీడియో షేర్ చేసింది. బీచ్‌లో ధోనీ, జీవా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. జీవా ఒడ్డున నిలబడి ఉండగా, ధోనీ నీటిలోకి దూకుతున్నాడు. కాగా.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. “ధోని తన కూతురితో కలిసి బీచ్‌లో ఒక అందమైన రోజును ఆస్వాదిస్తున్నాడు. వాట్ ఎ లవ్లీ పిక్చర్.’’, ‘‘ఐపీఎల్ వేలానికి ముందు ధోనీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకుంది. అలాగే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!