Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పాకిస్థాన్‌కు రూ.586 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి టోర్నీని పాకిస్థాన్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేకపోవడంతో.. భారత్ మ్యాచ్‌లు శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించవచ్చు. ఈ టోర్నీకి సంబంధించి తాజాగా ఐసీసీ బడ్జెట్ ను కేటాయించింది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
Olympics gold medal: ఒలింపిక్స్ బంగారు పతకంలో స్వర్ణం ఎంత ఉంటుందో తెలుసా?
అందిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు 70 మిలియన్ల డాలర్స్ బడ్జెట్ ను ఆమోదించింది. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా నేతృత్వంలోని ఐసీసీ ఆర్థిక, వాణిజ్య కమిటీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిందని ఐసీసీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంచనా బడ్జెట్‌తో పాటు అదనపు ఖర్చుల కోసం 4.5 మిలియన్ల డాలర్స్ అందించబడ్డాయి. 70 మిలియన్ల డాలర్లను భారత రూపాయల్లోకి మార్చినట్లయితే అది దాదాపు రూ. 586 కోట్లకు సమానం అవుతుంది.
Shocking Video: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై పడ్డ గేటు.. చివరికి ప్రాణాలు.?
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేదు. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే శ్రీలంక లేదా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా ఐసీసీ పాకిస్థాన్ కు అదనపు బడ్జెట్‌ను కేటాయించింది. టీమ్ ఇండియా వేరే వేదికపై ఆడితే.. దానికి 45 లక్షల డాలర్లు ఇచ్చారు. కానీ ఈ మొత్తం తక్కువగా ఉంటుందని అంచనా. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. నివేదికలను పరిశీలిస్తే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బిసిసిఐని ఒప్పించే ప్రయత్నం చేసింది. దాంతో టీమిండియా పాకిస్తాన్‌కు వచ్చి ఆడవచ్చు. కానీ అది జరగలేదు.