KS Ravi Kumar Comments on Balakrishna: నందమూరి బాలకృష్ణతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా 2018 వ సంవత్సరంలో జై సింహా సినిమాతో పాటు 2019 వ సంవత్సరంలో రూలర్ అనే సినిమాలు చేశారు కె ఎస్ రవికుమార్. ఆ తర్వాత దర్శకత్వానికి దూరం అయిపోయి పూర్తిగా నటన మీద ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు లారెన్స్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా గార్డియన్ అనే తమిళ సినిమా ప్రెస్ మీట్ కి హాజరైన కేఎస్ రవికుమార్ నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ గారికి షూటింగ్లో ఎవరినైనా నవ్వుతున్నట్టు అనిపిస్తే తను చూసినవుతున్నారని అనిపిస్తుందని వెంటనే కోపం వచ్చేస్తుందని ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతారని కె ఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు అలా ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ను ఫ్యాన్ తిప్పమని చెప్పాను.
Chandrababu: బీసీలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్.. రూ.4 వేలకు పెంపు
అతను అనుకోకుండా ఫ్యాన్ ని బాలయ్య వైపు తిప్పాడు. వెంటనే ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దీంతో శరవణన్ కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకి వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు వెంటనే ఆయన వీడిని ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి సార్ అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాను. అయినప్పటికీ ఆయన కూల్ కాలేదు వెంటనే నోరు మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని శరవణన్ కి అరిచి చెప్పాను. అప్పుడు ఆయన కాస్త స్థిమిత పడ్డారు అంటూ నందమూరి బాలకృష్ణ గురించి కె ఎస్ రవికుమార్ వ్యాఖ్యానించారు. అయితే నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరూ ఇలా మాట్లాడరు అని, అసలు సినిమా అవకాశాలు లేని వ్యక్తికి పిలిచి రెండు సినిమాలు చేసే అవకాశం ఇస్తే ఇప్పుడు ఇలా హీరో మీదే అవాకులు పేలుతున్నాడు అని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.