ప్రధాని నరేంద్ర మోడీని మూడు అంశాలపై ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ప్రధాని శాంతికి పిలుపు ఇచ్చి ఉంటే అది చాలా ప్రభావవంతంగా ఉండేది.. మణిపూర్‌కు విపక్షాలు వెళ్లాయి, రాహుల్ వెళ్లారు, మోడీ ఎందుకు వెళ్లలేదు? మణిపూర్ తగలబడుతుంటే.. భారత్ తగలబడుతున్నట్లేనని ఆయన తెలిపారు.