Motorola edge 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్లోకి తమ తాజా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అత్యాధునిక డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ మన్నిక, శక్తివంతమైన ప్రాసెసర్, మోటో ఏఐ ఫీచర్లతో మొబైల్ లాంచ్ అయ్యింది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మొబైల్ గురించి పూర్తిగా తెలుసుకుందామా..
డిస్ప్లే:
మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్‌లో 6.67 అంగుళాల 1.5K 10-bit pOLED స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చేస్తోంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గోరిళ్లా గ్లాస్ 7i రక్షణ ఉంది. ఇది మొబైల్ డ్యామేజ్ నుంచి రక్షణ కల్పిస్తుంది.
Read Also: Anantapur Crime: ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. కీలక వివరాలు వెల్లడి..!
ప్రాసెసర్, స్టోరేజ్:
ఈ ఫోన్‌లో 4nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 7300/7400 ప్రాసెసర్ ఉంది. దీనికి 12GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. మెమరీ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 15 తో పని చేస్తుంది. దీనికి మూడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు లభిస్తాయి.
కెమెరా ఫీచర్లు:
ఈ ఫోన్ కెమెరా సెటప్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP సోనీ LYTIA 700C ప్రధాన కెమెరా (OIS సపోర్టుతో), 50MP అల్‌ట్రా వైడ్ + మాక్రో కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్, 50x హైబ్రిడ్ జూమ్), 50MP ఫ్రంట్ కెమెరా (4K వీడియో రికార్డింగ్ సపోర్టుతో)లు ఉన్నాయి.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
బ్యాటరీ:
మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్ 5500mAh బ్యాటరీతో వస్తోంది. దీని కోసం 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్‌లో ఛార్జర్ కూడా లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ కు IP68 + IP69 రేటింగ్‌లతో పాటు మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. ఇది 1.5 మీటర్ల నుండి పడిపోయినా, అధిక ఉష్ణోగ్రతలు, తేమ నుండి తట్టుకుంటుంది.
మోటో ఏఐ ఫీచర్లు:
ఈ ఫోన్‌లో ఉన్న మోటో ఎఐ ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇందులో క్యాచ్ మీ అప్ (స్మార్ట్ సమరీలు ఇవ్వడం), పే అటెన్షన్ (రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్), రెమెంబెర్ దిస్ (పర్సనలైజ్డ్ మెమరీ రికాల్) లు ఉన్నాయి.
ధర, వేరియంట్లు:
మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్ పాన్ టోన్ గిబ్రల్టార్ సి (నైలాన్ లైక్ ఫినిష్), పాన్ టోన్ షంరాక్ (లెదర్ లైక్ ఫినిష్) రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ ఒక్కటే వేరియంట్ రూ. 25,999 ధరకు లభిస్తుంది. జూన్ 17 నుంచి ఆన్లైన్ లో ఫ్లిప్ కార్ట్, మోటోరోలా సైట్స్ లో అలాగే ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది. ఇక లాంచ్ ఆఫర్ల కింద యాక్సిస్ బ్యాంకు, IDFC బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది.