Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devineni Avinash: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాల్సింది. కానీ, అవి కేవలం ఓటు కోసం చెప్పిన వాగ్దానాలుగానే మిగిలిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, దాన్ని దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ఒక మీడియా చానెల్‌లో చేసిన వ్యాఖ్యల్ని, జగన్ కుటుంబానికి అన్యాయంగా సంబంధపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం కక్ష పూరిత రాజకీయాల పరాకాష్ఠ అని పేర్కొన్నారు. వైస్సార్సీపీ హయంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. జగన్ పాలనలో మహిళల పేరుతో పథకాలు ప్రారంభించి, వాటిని విజయవంతంగా అమలు చేశాం. మహిళలకు గౌరవంగా, రక్షణగా మారిన పరిపాలన అందించామని అన్నారు. వైఎస్ భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, మేము ఎప్పుడూ బయటకు చెప్పలేదుని వ్యాఖ్యానించారు.
Read Also: Sonam Raghuwanshi: మే 23న సోనమ్‌కు అత్త ఫోన్ కాల్.. రాజా గురించి అడిగితే ఏం సమాధానం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?