ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు.. ఈవెంట్స్ త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దీంతో నిరుద్యోగులు ఈవెంట్స్ పై కసరత్తు ప్రారంభించారు. అయితే.. డిసెంబర్ 8 నుంచి జనవరి 03, 2023 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించనున్నట్లు తాజాగా వెల్లడించింది పోలీస్ నియామక బోర్డు్. అయితే.. ఈ ఈవెంట్స్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారంకి చెందిన నాగమణీ అమె కుమార్తె త్రిలోకిని ప్రస్తుతం జరుగుతున్న ఎస్సై ఏంపికలలో ప్రిలిమినరీ ఈవెంట్స్ లో తల్లి బిడ్డలిద్దరూ అర్హత సాధించటం విశేషం. కాగా నాగమణి గతంలో హోంగార్డుగా పనిచేశారు. అనంతరం కానిస్టేబుల్ గా ఎంపికై ములుగు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇరువురి ప్రతిభకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
Also Read :Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినండి..!
ఇదిలా ఉంటే.. మొత్తం 11 కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ శారీరర సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈవెంట్స్ కు సంబంధించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు అధికారులు. బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తారని ప్రకటించింది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు. పార్ట్ 2 అప్లికేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.