Monkey : మధ్యప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ కోతి ఎట్టకేలకే పట్టుబడింది, ఈ కోతి రాజ్‌గఢ్‌లో దాదాపు 20 మందిపై దాడి చేసింది. దీంతో ఆ కోతిపై రూ.21,000 రివార్డు ప్రకటించారు. డ్రోన్ సాయంతో దాన్ని గుర్తించిన సిబ్బంది కోతికి మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. ఈ కోతి మానవులకు హానికరంగా మారింది. ఇళ్ల చుట్టూ తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. గత 15 రోజుల్లో కోతుల దాడితో 20 మంది స్థానికులు గాయపడ్డారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ కోతిని పట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకరించారు. అలాగే కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ఈ కోతిని పట్టుకుంటే వారికి రూ.21వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జయిని అటవీ శాఖ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుంది.
Read Also:Revanth Reddy: బండి సంజయ్, కేఏ పాల్ మాటలకి పెద్ద తేడా ఉండదు.. రేవంత్ సెటైర్లు
మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో నాలుగు గంటలపాటు శ్రమించి కోతిని పట్టుకున్నారు. డ్రోన్ సాయంతో కోతి ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. దానికి మత్తు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. మగతగా ఉన్న కోతిని పట్టుకుని బోనులో బంధించారు. ఈ సందర్భంగా స్థానికులు జై శ్రీరామ్, జై భజరంగ్ దళ్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మత్తు విచ్చుకున్న తర్వాత కోతి కోపంతో రగిలిపోయింది. బోనులోంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మనుషులకు ప్రమాదకరంగా మారిన కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీశాఖ రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కాగా, ఈ బృందానికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు రాజ్‌గఢ్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని పట్టుకున్నందుకు 21,000 ప్రకటించారు.
Read Also:Scooty Viral Video : విద్యుత్ స్తంభం ఎక్కిన స్కూటర్