కాంగ్రెస్ అగ్ర నేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా ముంబై వేదికగా ముగింపు సభ నిర్వహించారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం చెలరేగింది. తాజాగా శక్తి వివాదంపై రాహుల్ వివరణ ఇచ్చారు.
‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ వక్రీకరించారని రాహుల్ గాంధీ తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా క్లారిటీ ఇచ్చారు. మోడీ తన మాటలు ఇష్టపడరని. ఆయన తన మాటలు వక్రీకరించేందుకు, అర్థం మార్చి చెప్పేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎందుకంటే… ఆయనకు తాను లోతైన సత్యాన్ని చెప్పిన విషయం బాగా తెలుసు అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరిమీదైతే తాము పోరాటం సాగిస్తున్నామో దానినే శక్తి అని తాను సంబోధించానని.. ఆ శక్తి మోడీనే అని అన్నారు. ఆ శక్తి భారతదేశ వాణి అని, సంస్థలను, సీబీఐ, ఐటీ శాఖ, ఈడీ, ఎన్నికల కమిషన్, మీడియా, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటోందని రాహుల్ వివరించారు. ఆ పవర్‌తోనే నరేంద్ర మోడీ వేలకోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, స్వల్పమైన రుణాలను కూడా తీర్చలేక రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని రాహుల్ విమర్శించారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ తెలంగాణలోని జగిత్యాలలో సోమవారం జరిగిన ర్యాలీలో తిప్పికొట్టారు. తమ పోరాటం శక్తితోనేనంటూ ఇండియా కూటమి చెబుతోందని, తన వరకూ ప్రతి తల్లి, చెల్లి, కూతురు అంతా శక్తిస్వరూపాలేనని, శక్తి రూపంలో వారిని ఆరాధిస్తానని, తాను భరతమాత ఆరాధకుడినని చెప్పుకొచ్చారు. ఈ శక్తిని అంతం చేస్తామంటూ ఇండియా కూటమి సవాలును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మోడీ ప్రకటించారు.
మొత్తానికి శక్తి వ్యాఖ్యలు రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోడీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని రాహుల్ తిప్పికొట్టారు. ఇదిలా ఉంటే రాహుల్ చేసిన తన తల్లి దగ్గర ఓ సీనియర్ నేత కన్నీళ్లు పెట్టుకున్నారన్న వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యా్ఖ్యలు తన గురించి కాదని తెలిపారు.
ఇది కూడా చదవండి:CEO Vikasraj: 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్..