Brahmanandam : బ్రహ్మానందం మీద నిన్నటి నుంచి ఒక కాంట్రవర్సీ మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తోంది. మంచు మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కు బ్రహ్మానందం వెళ్లారు. అయితే బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈవెంట్ లో బ్రహ్మానందం ను కలిశారు. ఒక ఫొటో దిగుదాం రా అన్నా అంటూ బ్రహ్మానందం చేతు పట్టుకుని అడుగుతున్నా.. ఏ వద్దు ఇప్పుడు అంటూ బ్రహ్మానందం…
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డువడ్లు పండిస్తారు. అది తెలిసే సన్న వడ్ల కు 5 వందల బొనస్ అంటూ ప్రకటన చేశారు.
లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్‌లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని…
నీలోఫర్ ఆస్పత్రి నవజాత శిశువులు, వివిధ ఇబ్బందులతో వున్న చిన్నారులకు భరోసా కల్పించే ప్రభుత్వాసుపత్రి. ఎంతో చరిత్ర వున్న ఈ ఆస్పత్రిలో అప్పుడప్పుడు వైద్యం అందక చిన్నారులు మరణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి వివాదం రేపింది. ఆస్పత్రిలో ఉదయం ఇద్దరు చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చింది నర్స్. అయితే, ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారంటున్నారు తల్లిదండ్రులు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆరోగ్యం విషమించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఈ…
ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.