టీడీపీ, జనసేన. బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగలం బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఇకపోతే సభలో కొందరు యువకులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.
ALSO READ: Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది
కొందరు టీడీపీ అభిమానులు సభలో ఏర్పాటుచేసిన లైట్ పోల్స్ పైకి ఎక్కడంతో మోడీ ఆగ్రహించారు. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. దానిని ఆపి మరీ లైట్ పోల్స్ పైకి ఎక్కిన కార్యకర్తలతో ప్రధాని మోడీ వారించారు. ‘ తమకోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణాలు మాకు చాలా విలువైనవి’ అంటూ వారిని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ స్వయంగా చెబుతున్న గాని అభిమానులు వినక పోవడంతో ముందుగా వారిని కిందకి దించాలంటూ ప్రధాని పోలీసులకు సూచించారు.
ALSO READ: Viral Video: దేవుడా.. ఓ మొసలిని మరో మొసలి ఇలా తినేస్తుందేంటో..?!
ఈ వేదిక సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రము అప్పుల ఊబిలో నలిగిపోతుందని.. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్ర మోడీ రాక బలాన్ని తెచ్చిందని చెప్పుకొచ్చాడు. మరోసారి ప్రధానమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం అంటూ తెలియజేశాడు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మొదలైన పొత్తు మరోసారి బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకుపోతున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ అమరావతికి అండగా ఉండాలని చెప్పేందుకు ఆయన ఇక్కడికి వచ్చారని తెలిపారు.